..
madiki tochinadi...manasuki nachinadi.

Saturday, 25 June 2022

అంతం లేని తీరం

అలలై  ఎగసిపడే   ఆలోచనలు కోకొల్లలు..

అందని   తీరానికై   అహర్నిశలు పయనించే ..,సాగర లహరికలు..!!

అలుపే ఎరుగని , అంతం తెలియని  ఊహలు ఎప్పటికీ ఎన్నటికీ తీరం చేరబోవేమో..!!

Monday, 6 September 2021

నీకై...

తెంచేసుకుంటే ,తెగిపోయేంతటి బలహీన బంధాలను... నేను  ఏర్పరుచుకోలేదు...!

తెగించి  ,త్వరపడేంతటి బలమైన బంధాన్నీ ..బ్రతుకు నాకు ఏర్పరచలేదు...!

తెగించలేక..., త్యజించలేక...  నీ భాషలో ఊగిసలాట..!

నాకదీ..........!!

Tuesday, 19 January 2021

ప్రామాణికత

తనని ఎంతగా గుర్తుకు తెచ్చుకోవచ్చునంటే... లెక్కపెట్టలేనన్ని సార్లుతలుచుకొనేంతగా...!!

 తనపై నమ్మకాన్ని ఎంతగా వుంచాలంటే...

అనుమానానికి తావేలేనంతగా...!!

తనకై ఎంతగా ఎదురు చూడొచ్చునంటే...

అసలు సమయాభావమనే భావన లేనంతగా..!!

తనని ఎంతగా ఇష్టపడాలంటే...

అసలు అయిష్టత అనే మాటే మరిచిపోయేంతగా...!!

Friday, 25 September 2020

 అలా వెళిపోతే ఎలా...

మీ గొంతులో దాగి వున్న అమృతాన్ని, మరణాన్ని జయించేందుకు కడుపులోకి మింగకపోతే ఎలా...

అలా వెళిపోతే ఎలా...

ఎందరి హృదయాలకో  మీ గాత్ర స్వాలంబన అందించి, మీ హృదయ స్పందనను అర్ధాంతరంగ ఇలా ఆపేస్తే ఎలా...

అలా వెళిపోతే ఎలా...


Thursday, 10 September 2020

కాలయవనిక’

కలయైన ఇలయైన  కదిలిపోయే క్షణమాగక 

కావలి కాయగ లేక కాలయాపనకు కాసేపు నిలుపనులేక

క్షణవీక్షణకు తావీయదిక

కలల అలలాంటి 

కాల్పనిక కాలయవనిక...!

Thursday, 16 July 2020

కరోనా...

 నాడు కలసి ఉంటే కలదు సుఖమన్నారు ..
 నేడు కదలకు సుమా కాపాడుకో నీ ప్రాణమన్నారు..!
నాడు  అక్కున చేర్చుకునే  ఆలంబనే అదృష్టమన్నారు..
నేడు అస్సలు తాకరాదు సుమా ఆరోగ్యప్రదమైన ఆరడుగుల దూర పలకరింపులు మేలన్నారు...! 
కలికాలమంటారొకరూ.../ కరోనా కాలమొచ్చేసిందనొకరూ...!!

ముందూ.. వెనకా..!!?

ఎప్పటికైనా తప్పదు .. ఎవ్వరికైనా తప్పదు..

ఎలాంటి వారికైనా తప్పదు.. ఎక్కడి వారికైనా తప్పదు..

ఎంతటి జాగురతతో మెలిగినా తప్పదు.. 

ఏపాటి  ఏమరుపాటు కలిగినా తప్పదు..

ఏమనాలో నిన్ను ..,మరణమని అనేసి మరిచిపోవటానికి 

మనమధ్య  మమతలను వాటి తాలూకు మనుషులకు..

రణరంగానికేగే సైనికులకు సైతం మరణం తప్పదు...!


 

Sunday, 12 April 2020

మేమే... ఇలా ఉంటే ,రేపటిరోజును మీకు ఏమందించగలం...?
మాలో మేము కులమతాల కొట్లాటల బురద రాసుకు తిరిగే
మనల్ని చూస్తూ పెరిగే భావితరాలకు ఐకమత్యమనే ఐశ్వర్యాన్ని
భవిష్యదాస్తిగా ఏమందించగలం మనం...!

మేమే... ఇలా ఉంటే ,రేపటిరోజును మీకు ఏమందించగలం...?
మాకై మేము ఆరోగ్యపు అలసత్వాన్ని అవలభించే
మనల్ని  చూస్తూ పెరిగే భావితరాలకు భరోసానిచ్చే
బలవర్ధకమైన ఆరోగ్యైశ్వర్యాన్ని భవిష్యదాస్తిగా  ఇక ఏమందించగలం మనం...!

మేమే... ఇలా ఉంటే ,రేపటిరోజును మీకు ఏమందించగలం....?
మాకోసమై మేమే బ్రతుకుతూ సాటి వారిని కనీసం మనుషులుగా
సైతం గుర్తించక స్వార్ధపూరిత సహవాసాలతో మెలిగే మనల్ని
చూస్తూ పెరిగే భావితరాలకు సమైఖ్యతైశ్వర్యాన్ని భవిష్యదాస్తిగా ఇక
ఏమందించగలం మనం...!

మేమే... ఇలా ఉంటే ,రేపటిరోజును మీకు ఏమందించగలం...?
మన మనుగడకే కారణమైన పంచభూతాలను పరిపరి విధాల
దుర్వినియోగపరిచే మనల్ని  చూస్తూ పెరిగే భావితరాలకు
కాలుష్యరహిత స్వచ్ఛతైశ్వర్యాన్ని భవిష్యదాస్తిగా ఇక ఏమందించగలం మనం...!

మేమే... ఇలా ఉంటే ,రేపటిరోజును మీకు ఏమందించగలం...?
మనలో మనమే ఆధునికతతో మమేకమైపోవాలవాలనే ఆలోచననే
మరచి అడ్డదిడ్డ పోకడలను  అనుసరిస్తూన్న మనలిని  చూస్తూ పెరిగే
భావితరాలకు ఆశావహదైశ్వర్యాన్ని భవిష్యదాస్తిగా ఇక ఏమందించగలం మనం..!

Saturday, 4 April 2020

ఐక్యత లేక మతమా...??

ఒక క్లాసులో ఒక టీచరు పిల్లలకి  పాఠం  చెప్త్తూ,”పిల్లలూమీరందరూ   దేవుని బొమ్మను గీయండి “. అని తగిన టైం ఇచ్చిచూస్తున్నారట.    క్లాసులో వున్న భిన్న మతాలూ.., సంస్కృతులూకలిగిన పిల్లలందరూ తమ తమ కుటుంబంలోని అందరూఅనుసరించీ నమ్మేటటువంటి దైవం యొక్క బొమ్మనే తమకొచ్చినవిధాన వేసి చూపించారటఅలాగని పాఠం నేర్పే క్లాస్ టీచరుచెప్పారు కదా అని టీచరుకి  ఇష్టమైనటువంటి లేదా టీచరుమతానికి సంబంధించిన దేవుని బొమ్మను గీయలేదువారుపుట్టినప్పటి నుండీ అనుసరిస్తున్న దైవాన్నే గుర్తు చేసుకుని బొమ్మనే గీసారుఅలాగని పిల్లలందరూ ఒకే రకమైన బొమ్మనుమాత్రమే గీయండని ,  టీచరూ ఆంక్షలు పెట్టలేదుఇక్కడ టీచరుఆలోచన ఏమిటంటే.. ,   పిల్లలందరి చేతా ఐక్యతగా విద్యనునేర్పించాలి అంతే..! మరి పిల్లలందరు కూడా టీచరు నుండినేర్చుకోవాలనే నిబద్ధత మాత్రమే కలిగివుండటం నిబద్ధతకోసమే సదరు టీచరుని నియమించడం కూడా..!

Wednesday, 1 April 2020

దీనిని  మథ్యంతర’గతీ’.. అనాలా...??

       నేటి కరోనా కర్ఫ్యూ కాలంలో.., ప్రజలందరూ కనపించని శత్రువుకు భయపడి దాదాపుగా దాక్కొనే పరిస్థితులలో.. కొందరు చేతికి పనీ.. చేతిలో మనీ లేక అల్లాడుతుంటే..  తమ విలాసాలకు లోటైపోతుందనే వారు మరికొందరు..! అందరికీ అన్నీ ఉన్నా కూడా తాము ఎన్నో యిబ్బందులను ఎదుర్కొంటున్నామనే వాదన కొందరిదీ.!  ఇకపోతే... ఈ రోజు బాగా కలచివేసిన విషయం ఏంటంటే.., ఒక కుటుంబంలో పెద్దవయస్సావిడ కి  ఎన్నాళ్ళ బట్టో ఆరోగ్యం బాగా క్షీణించి మంచానే వుండే పరిస్థితి. ఆవిడ చనిపోతోందని ఇప్పటికి 4 సం,, ల నుండీ ఎదురుచూస్తున్నారు అనాలేమో..! కానీ ఆవిడకి ఇంకా పైనుండి పిలుపు రాలేదనుకుంటా. కానీ ఈ కరోనా హడావిడిలో ఆవిడకి వైరస్ సోకితే ఏమవుతుందో  అనే భయం కంటే, ఈ రోజులలో చనిపోతే ఎలాగో పాపం ఎవరికీ రావటానికి కూడా వీలుండదు.. సిటీ మొత్తం లాక్ డౌన్ లో వుందీ కదా అని ఆలోచన చేయనే చేయట్లేదు ఆ కుటుంబం..., పైగా తమకు వున్న పరపతికి ఆవిడ చనిపోతే, అందరికీ భోజనాలు వగైరా లాంటి వాటికి చాలా డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుందనీ.., అదే నేటి కర్ఫ్యూ టైంలో అయితే, కర్మలకూ.. కాండలకూ ఖర్చులేకుండా.., ప్రజా హితార్థం అని చెప్పి,  అవన్నీ చేయకుండానే, తమ కుటుంబం వరకు ఆ తంతు కానిచ్చేయవచ్చను అనే వారి ఆలోచనకు , ఎలా రియక్ట్ అవ్వాలో అని నా మెదడు నాకు చెప్పడం మానేసి తాను ఆలోచించ సాగిందీ..! 

Wednesday, 25 March 2020

💚💙❤️💚💙❤️

తీపి, చేదు కలిసినదే జీవితం....

కష్టం, సుఖం కలిసినదే జీవితం....

జ్ఞానం, అజ్ఞానం కలిసినదే జీవితం....

మంచి, చెడు కలిసినదే జీవితం....

నమ్మకం, అనుమానం కలిసినదే జీవితం....

ఆశ, నిరాశలు కలిసినదే జీవితం....

భావ రాగ భాష్యం, మౌనం కలిసినదే జీవితం....

రాజపూజ్యం, అవమానం కలిసినదే జీవితం....

సంతోషం, దుఃఖం కలిసినదే జీవితం.....

పురోగతులు, తిరోగతులు కలిసినదే జీవితం....

ఆరోగ్యం, అనారోగ్యంలు కలిసినదే జీవితం....

ఈ జీవితంలో ఉన్న అన్ని అనుభూతులను గుర్తు చేసేదే
ఉగాది పర్వదినం.

*మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు*

🍀 *KKR* 🍀

Sunday, 8 March 2020

An awesome poet’s.. awesome writing ✍🏻

వదిలి వెళ్ళకు అని అనలేను..,
వదులుకోమాకూ అని చెప్పలేను..!
వదిలే దారుల గమ్యం, నీవై సాగే ఈ బంథం....,
వదులే లేని ఈ బంథం ఎప్పుడు ముడిపడినదో..,
ముడిలో పడి నలిగే మనసు ఎపుడు తడబడినదో...,
మరి ఇది తడబాటో..లేక ఎద బాటో...!!
                          KKR 

Friday, 24 January 2020

భూమి మీద ఆడపిల్లలను బ్రతకనీయకపోతే... రేపు మిమ్మల్ని  భూమి మీదకితేవడానికి తల్లులు ఎక్కడ నుండి వస్తారురా..?? మీరు ఎంతటి మృగాలుఅయినా,మరమనుషులకు మాత్రం పుట్టరు.. దయచేసి గమనించండి..🙏🏻🙏🏻

Tuesday, 21 January 2020

మన   సమాజపు జాత్యంహకార  వేటలో..

అల్ప సంఖ్యాకులైన  అగ్రవర్ణాల వారు సలిపే దాడిలో..,

అథిక  సంఖ్యాకులైన  సూద్రులుఅతి  సూద్రులు   దాడి తాము కూడా    చేస్తున్నామని భావించుకొని..,అగ్రవర్ణాల వారికి కావలి కాయడంతో అల్ప సంఖ్యాకుల  దాడి  వేటగా మారి సఫలమవుతుంది..


కానీ.., అథిక సంఖ్యాకులు  వేటలో బలి అవుతున్నది తమ జాతివారే ననితెలుసుకోలేపోతున్నారు!
                                  By..
                               🌷KKR 🌷

Tuesday, 7 January 2020

*సిగ్గుపడరా ఓ ఆంధ్రుడా..!*

 ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, గత ఆరు నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ లక్ష్యాల కోసం కొన్ని శక్తులు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇవన్ని కూడా ఆందోళనకరంగా మారాయి.

*అయినా సరే ప్రజల్లో మాత్రం ఎటువంటి స్పందన లేదు.*

ముఖ్యంగా ఆంధ్రులు చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు.

రాజధాని విషయంలో మనకెందుకులే, ఆ రైతులు ఇబ్బంది పడితే మనకేమిటిలే అనే ఉదాసీన వైఖరి ఇప్పుడు నిజంగా ఆందోళన కలిగిస్తుంది.

 ఒకప్పుడు ఆంధ్రుడు అంటే పౌరుషానికి ప్రతీక. కష్టపడే తత్త్వం, అందరూ బాగుండాలి అనే ఆలోచన.

తమలో తమకి ఎన్ని గొడవలు ఉన్నా పరాయి వాడు వస్తే ఎదురొడ్డి నిలుచున్న గతం.

కానీ ఇప్పుడు నిజంగానే అవన్నీ గత స్మృతులుగానే మిగిపోతున్నాయి.

“ఆంధ్రుడా నిన్ను కొన్ని మాటలు అంటాను భరించు…

నీకు భరించడం అలవాటే కదా… కనీసం పట్టించుకోవు కదా… అందుకే నేను కొన్ని మాటలు అంటాను భరించు…

*నీకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నాయా…?*

*నీ భవిష్యత్తు గురించి నీకు అసలు బెంగ గాని భయం గాని ఉందా…?*

అవును నేను నిన్ను అడిగిన ప్రశ్నలు నీ శ్రేయోభిలాషిగానే అడిగాను…

ఎందుకంటే నాకు నిన్ను చూస్తే చిరాకుగా ఉంది…

నీ చేవ చచ్చిన మనస్తత్వం చూస్తే జాలేస్తుంది…

కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉంది.

రాష్ట్ర విభజన సమయంలో రాజధాని లేకుండా విభజించారు..

రాజకీయ పార్టీలు ముందుకి వచ్చి విమర్శలు చేశాయి గాని నీ అంతట నువ్వోచ్చావా…?

భావోద్వేగంగా పోరాటం చేసావా…?

ప్రత్యేక హోదా లేదన్నారు. కనీసం నీ బిడ్డల భవిష్యత్తు కోసం అయినా ముందుకి వచ్చావా…?

ఒక్క పోరాటం అయినా నీ అంతట నువ్వు చేసావా…?

రైల్వే జోన్ లేదన్నారు.. కనీసం నీలో పౌరుషం కూడా ఎక్కడా నాకు కనపడటం లేదు…

ఎందుకు నువ్వు ఆంధ్రుడిగా చెప్పుకోవడం…

నా తెలంగాణా అంటూ నిన్నటి వరకు నీతో కలిసి ఉన్నవాడు ఏళ్ళకు ఏళ్ళు పోరాటం చేశాడు. నాకు అన్యాయం జరుగుతుందిరా ఆంధ్రోడా అంటూ నిన్ను అమ్మనా బూతులు తిట్టాడు…

అయినా నీకు బాధ లేదు.

కష్టపడి కట్టుకున్నావ్ అమరావతిని…

దాన్ని భ్రమరావతి అన్నా నీలో పౌరుషం లేదేంటి…?

ఇప్పుడు అదే అమరావతిని శ్మశానం అన్నారు….

అయినా సరే నీకు బాధ రావడం లేదు…

*ఇంకెప్పుడు నువ్వు ఆంధ్రుడిలా బ్రతికేది…?*

నువ్వు పుట్టిన నేల తల్లి గురించి ఎప్పుడురా ఆలోచించేది…

బాధపడటం కాదు సిగ్గు పడు…

ఎందుకు ఇలా ఉన్నాను అని సిగ్గు పడరా ఆంధ్రుడా…

మాయ మాటలు వింటూ బతికేసేయ్. ఇప్పుడు నువ్వు కట్టుకున్న రాజధానిని ఎవరో ఎక్కడికో తీసుకుపోతున్నారు

Sunday, 29 December 2019

Surya Online News website
MAIN MENU.

*సిగ్గులేని సమాజమిది!*


*రాజధాని మార్పుపై స్పందన లేని ఆంధ్రా జనం*

తెలంగాణను చూసి నేర్చుకోని ఆంధ్రా సమాజం

*_కులం, స్వార్ధమే ఆంధ్రాకు శాపం_*

‘మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది

పదండి ముందుకు.. పదండి త్రోసుకు

పోదాం పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ, పదం పాడుతూ

హృదరాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం.

ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన సోమరులారా చావండి.

నెత్తురుమండే, శక్తులు నిండే సైకికులారా రారండి’

- ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా కేంద్రం గుర్తించి, ప్రధాని స్వయంగా శంకుస్థాపనకు హాజరయిన అమరావతి నగర రాజధానిని విశాఖకు తరలిస్తామన్న.. కొత్త ఏలికల ప్రకటన తర్వాత కూడా చేవచచ్చిన ఆంధ్రా సమాజానికి, చైతన్య రహితమైన ఆంధ్రా ప్రజలకు మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత నూటికి రెండొందల శాతం సరిపోతుంది. అవును.. ఇది నిజం.

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని

అగ్గితోటి కడుగు, ఈ సమాజ జీవచ్ఛవాన్ని!

మారదు లోకం, మారదు కాలం

దేవుడు దిగిరాని, ఎవరు ఏమైపోనీ

మారదు లోకం మారదు కాలం!

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి?

గొర్రెతాటుమందకి నీ జ్ఞాన బోధ దేనికి?

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?

ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం?

*ఆధునిక మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆర్తి, ఆవేదనతో రాసిన ఈ గేయం ఇప్పుడు అమరావతి ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గాయంగా మారిన వైనానికి సాక్ష్యంగా నిలిచింది.*

అవును.. నిజం! ఆంధ్ర సమాజం సిగ్గులేని సమాజంగా దేశ ప్రజల ముందు సిగ్గుతో నగ్నంగా నిలుచున్న నిజమిది. ప్రత్యేక రాష్ర్టాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల పోరాటపటిమ, చిత్తశుద్ధి, అంకితభావం, ఆగ్రహజ్వాలతో పోలిస్తే ఆంధ్ర సమాజ పౌరుషం పిపీలీకమే! దశాబ్దాల నాటి తెలంగాణ రాష్ట్ర కాంక్షను పోరగాడి నుంచి కురువృద్ధుడి వరకూ రోడ్డెక్కి సాధిస్తే.. వచ్చిన రాజధాని నగరాన్ని మరో ప్రాంతానికి తరలిస్తున్నా అడ్డుకోలేక, చేవచచ్చి, చేష్టలుడిగిన ఆంధ్రా సమాజ పిరికితనం, పలాయనత్వం, వెన్నులేని వీరత్వానికి ఏం పేరు పెట్టాలి? *_రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కాకుండా.. పీల్చే గాలి, వదిలే గాలిని కూడా కులం కోణంలో ఆలోచించి, నా చిన్ని బొజ్జకు శ్రీరామరక్షని, ఎవరి స్వార్ధం వారు చూసుకునే ఆంధ్రా సమాజ స్వార్ధానికి ఏ బిరుదునివ్వాలి?_*

*మూడు రాజధానుల పేరుతో పాలకులాడుతున్న రాజకీయ క్రీడను, కనీసస్ధాయిలో ఎదుర్కోని పిరికి సమాజానికి ఏం పేరు పెట్టాలి?*

‘తెలంగాణ ప్రజల మాదిరిగా పోరాడకుండా వచ్చిన రాష్ట్ర రాజధానిని కాపాడుకోలేని గుంటూరు-కృష్ణా జిల్లా ప్రజల చైతన్యరహిత పరిస్థితి చూస్తే జాలివేస్తోంది. ఒక రాజధాని నగరాన్ని తరలిపోకుండా అడ్డుకునే చైతన్యం ఈ ప్రజల్లో లేకపోవడం బాధాకరం. అమరావతిని అయోధ్యలా నిర్మించుకోవాలి’ - చైతన్యరహితులైన రాష్ట్ర ప్రజల నిస్తేజాన్ని ఆవేదనతో వివరించిన భువనేశ్వరి పీఠాథిపతి కమలానంద భారతి స్వామి మాటలొక్కటి చాలు. ఆంధ్రా సమాజం స్వార్ధంతో ఎంత బిజీగా ఉందో చెప్పడానికి!

రాజధానిని తరలించవద్దంటూ రోడెక్కిన 29 గ్రామాలకేనా ఆంధ్రుల ఆత్మాభిమానం? 30వ గ్రామంలో, మిగిలిన జిల్లాల్లో ఏమైందీ ఆ ఆత్మాభిమానం? ఎవరిని చూసి భయపడి దుప్పటి ముసుగేసుకుంది? ఎవరిని చూసి పంచె, ప్యాంట్లు తడుచుకుంటోంది? కోరకుండానే వచ్చిన రాజధాని తరలిపోకుండా, కాపాడుకునేంత సత్తువ ఆంధ్రా సమాజానికి చచ్చిపోయిందా?
*చచ్చు పుచ్చు వాదనలు, మతిలేని తర్కాలు, అంతులేని అతి తెలివి, పక్కవాడిని ముంచి తన జేబు నిండాలనుకునే అతి తెలివి, నరనరాన మోసం, వెన్నుపోట్లకు అలవాటుపడిన ఆంధ్రోళ్ల అతి తెలివితేటలు.. పాలకుల విభజించి పాలించే తెలివితేటల ముందు తెల్లబోయాయా? రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామంటే గుంటూరు-కృష్ణా జిల్లాల జనం రక్తం సలసల మండదేం? పల్నాటి పౌరుషం ఐసుగడ్డలా కరిగికూర్చుందేం? మాకూ పౌరుషముందని రోషం త న్నుకురాదేం? *విశాఖకు వెయ్యి కిలోమీటర్లు పైనున్న ‘సీమ పౌరుషం’ యాడకుపోయింది?*

_ఇంత చైతన్యరహిత, కుల సమాజంలో బతుకుతున్న సగటు ఆంధ్రోడి ఆవేదన ఇది._

*_విశాఖను రాజధానిగా ప్రకటించాలన్న సర్కారు నిర్ణయాన్ని, గుంటూరు-కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల, రాయలసీమ ప్రజలు ప్రతిష్ఠగా తీసుకోకపోవడం ఆశ్చర్యపరుస్తోంది._*

చంద్రబాబు చెబితే, కన్నా మద్దతునిస్తేనో, కమలానందభారతి స్వామి తిడితేనో తప్ప స్పందించని కుల సమాజం నుంచి పౌరుషం, వీరత్వాన్ని ఆశించటం అవివేకమే.
*దశాబ్దాల నుంచి కులం కంపునే మహా ఇంపుగా భరించడం అలవాటయిన ఆంధ్రా సమాజం..* రాజధాని మార్పు ప్రయత్నం తర్వాత కూడా చైతన్యరహితంగా కనిపించడం చూస్తే శ్రీశ్రీ చెప్పింది నిజమేమోననిపించక మానదు. అసలు శ్రీశ్రీ గానీ, సిరివెన్నెల సీతరామశాస్త్రిగానీ ఆంధ్రోళ్ల వెధవాయిత్వం గురించి ముందే ఊహించి రాశారేమోననిపిస్తుంది.

పక్కనే ఉన్న తెలంగాణ ప్రజలు.. ప్రత్యేక రాష్ట్రం కోసం చావోరేవోగా సాగించిన పోరాటం, ప్రదర్శించిన ఐకమత్యం చూసి ఆంధ్రా సమాజం సిగ్గుతో చితికిపోవాలి. పార్టీలకు పాతరేసి ఒక్కగొంతుకతో నినదించిన తెలంగానం, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ సమాజం చూపిన తెగువ చూస్తే, ఆంధ్రా సమాజం పౌరుషంతో రగిలిపోవాలి. సిగ్గుతో కుమిలిపోవాలి. కులం, మతం లేకుండా సాగిన తెలంగాణ సమాజం నేర్పిన పోరుపాఠాలు నిజానికి ఈ దే శానికే ఓ మార్గదర్శం. ఎన్నో ఏళ్లు పోరాడితే గానీ, వందలు, వేలమంది అమరులైతే గానీ, కేసీఆర్ లాంటి వ్యూహకర్త వల్ల రోడ్డుమార్గం పట్టిన ప్రజల పోరాటం వల్లగానీ తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించలేదు. కానీ, ఆంధ్రాలో అమరావతి అలా కాదు. ప్రజలు పోరాడకుండానే వచ్చిన రాజధాని నగరం అది. దాని నిర్మాణానికి కేంద్రం వేల కోట్లు కుమ్మరించిన నగరమది. నగర నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తరలివచ్చి.. దేశంలోని నదుల నుంచి జలం, మట్టిని అక్కడ కలిపిన పుణ్యభూమి అది. ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతీక అది. మరి అలాంటి రాజధాని నగరాన్ని మరో చోటకు తరలిస్తుంటే స్పందించాల్సిన సమాజం.. చేవ చచ్చి, బిక్కమొహమేసి, 29 గ్రామాల ఆర్తనాదాలకే పరిమితమయి, మిగిలిన ప్రాంతాలు మాకేమిటన్న దిక్కుమాలిన, దిక్కులేని పలాయనవాదంతో గుడ్డిగుర్రాలకు పళ్లుతోముకుంటూ, చచ్చు పుచ్చు వాదనలతో తీరికూర్చిని చేసుకునే రచ్చబండ రాజకీయాలతో సాధించేదేమిటన్నది ప్రశ్న.

రాజధాని తరలింపు అంశం ఇప్పుడు 29 గ్రామాలకే ప్రతిష్ఠగా మారింది. ఉత్తరాంధ్రకు తప్ప, మిగిలిన ప్రాంతాలకు దాని వల్ల ప్రయోజనం లేదని తెలిసినా, రాజకీయ-కులతత్వంలో దశాబ్దాలు సహజీవనం చేసి, ఆ పిచ్చ నుంచి, ఆ ఉన్మాదం నుంచి బయటపడలేని ఆంధ్రా సమాజ చైతన్య రాహిత్యమే ఏలికలకు బ్రహ్మాస్త్రంగా మారిందన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఆ కులోన్మాదం, ప్రజల చైతన్యరాహ్యింతోనే పాలకులు చలిమంటలు వేసుకుంటున్నారన్న నిజం తెలియని ఆంధ్రా ప్రజల అమాయకత్వాన్ని చూసి సిగ్గుపడాల్సిందే.

*_రాజధానిని తరలిస్తున్నారన్న అంశం కంటే.. అది కమ్మ వారికి నష్టమా? రెడ్లకు లాభమా? టిడిపికి శాపమా? వైసీపీకి వరమా? ఏ కులానిది పైచేయి? అన్న మతివిహీన చర్చలే తప్ప.. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమిటి అన్న సామాజిక స్పృహ ఆంధ్రా సమాజానికి లేకపోవడం దౌర్భాగ్యం._*

*గుంటూరు-కృష్ణా కమ్మవాళ్లది, రాయలసీమ రెడ్లది, ఉత్తరాంధ్ర బీసీలదన్న తీసివేతలు, కూడికల రాజకీయమే తప్ప.. మొత్తంగా అమరావతి మనది అన్న సమిష్టి కోణం ఏ కులంలోనూ కనిపించకపోవడం మరో దౌర్భాగ్యం.*

*_అది తమదేనని అత్యుత్సాహం ప్రదర్శించి, మిగిలిన కులాలను సొంతం చేసుకోనీయని కమ్మదనమే ఇంత కార్చిచ్చుకు కారణమని గ్రహించకపోవడం మరో ప్రారబ్ధం._*

*మరి బాబుకు నీతులు చెప్పి, రాజధానికి 30 వేల ఎకరాలు కావాలి. తాను రాజధానికి వ్యతిరేకం కాదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలని వాదించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాటిని బాబు కంటే స్పీడుగా నిర్మించి తన ఘనతేమిటన్నది కదా చూపాలి!* *మరి అది చేయకుండా మరొకచోటకు రాజధానిని తరలిస్తే అందులో ఏమిటి గొప్ప?*
 ```మాట మార్చడం, మడమ తిప్పడం అంటే ఇదేనా?``` _బాబు అవినీతి, ఆశ్రితపక్షపాతంపై ఆగ్రహోదగ్రుడైన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై విచారణ చేసి, అక్రమార్కులను శిక్షించకుండా ఈ ఆరునెలలు మీనమేషాలు ఎందుకు లెక్కబెట్టినట్లు?_

*అక్రమార్కుల అరాచకాలే నిజమైతే, వారిని నడిరోడ్డున నిలబెట్టి సంకెళ్లు వేసి శిక్షించడానికి అడ్డుకుందెవరు?*
*రాజధానిని మారిస్తే కమ్మ వర్గాన్ని దెబ్బతీసినట్లు మురిసిపోతే.. రేపు అదే విశాఖలోనూ ఆ వర్గమే అన్నింటా దర్శనమిస్తే, అప్పుడు రాజధానిని శ్రీకాకుళానికి మారుస్తారా?*
పోనీ ఆ స్థానాన్ని రెడ్లు ఆక్రమిస్తే, మళ్లీ వచ్చే కొత్త పాలకుడు రాజధానిని ఎక్కడికి మారుస్తారు? అంటే బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పినట్లు *రాజు మారితే రాజధాని మారాలా? అప్పుడు మద్రాసీలు తంతే కర్నూలుకు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు, అక్కడ తెలంగాణ వాళ్లు తంతే బెజవాడకు వచ్చిన ఆంధ్రోడు..* ఇక విశాఖకు అంపశయ్యపై చేరాల్సిందేనా ? నిలువెల్లా గాయాలై శ్వాసకూడా పీల్చుకోలేనంతగా క్షతగ్రాతుడైన ఆంధ్రోడి చివరి మజిలీ ఏదీ అన్నది సగటు ఆంధ్రుడి ప్రశ్నలు. రాజకీయ కోణంలో కాకుండా, సామాజికపరంగా ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చే దమ్మెవరికి ఉంది?

Tuesday, 17 December 2019


మనుగడనుండి.., మహోన్నతి వరకూ...
మరపునుండి..., మథురస్మృతి వరకూ...
మనవినుండి..., మమేకం వరకూ...
మహాశయం నుండి.., మహోధ్యమం వరకూ...
మనసునుండి .., మమత వరకూ...
మనిషి నుండి.., మహర్షి వరకూ..
మారుతున్న మనిషి.. సాటి మనిషి పట్ల
మానుషిగా మారుతున్నాడెందుకూ...??



Thursday, 5 December 2019

బాధలోంచి వచ్చే ప్రతి మాట భావం తో కూడి ఉంటది.....

భావంతో వచ్చే ప్రతి మాట బాణంతో కూడి ఉంటది....

బాణంతో వచ్చే ప్రతి మాట
బంగారు భవిష్యత్తుతో కూడి ఉంటది....
                                     By.
                             🌸 *KKR*🌸

Thursday, 14 November 2019

*మనం మనుషులం*

మన ఆచారాలుసంప్రదాయాలుపద్దతులు కేవలం నాగరికత మొదలు అయ్యాకేవచ్చాయి....

మతం గురుంచి ప్రక్క వారిని విమర్శించే వారు ముందు మనం మనుషులం అనిగుర్తించాలి....

సింధు నాగరికత తో మొదలు అయిన మన ప్రయాణం మౌర్యులుద్రవిడులుఆర్యులుఇంగ్లీష్ వారి రాకతో నూతన పద్దతులుసంప్రదాయాలు అలవరుచుకొన్నాం....

ఎన్నో సంప్రదాయాలుఆచారాలు ఇతరుల రాకతో మొదలు అయి కొన్ని కాలంతోనిలబడలేక సంఘ సంస్కర్తల పోరాటాల ఫలితంగా సమాధి చేయబడ్డాయికొన్ని ఇంకాఆచారణలోనున్నాయి....

సంప్రదాయాలుఆచారాలు అనేవి కాలంతో మారుతూ ఉంటాయి....

కాబట్టి  ఆచారాలుసంప్రదాయాలు కోసం పోరాటాలు గొడవలు మొ.... చేయాలి అనిఅనుకొనేముందు మనం మనుషులం
🙏🏻

🌸 *KKR* 🌸

Friday, 18 October 2019

మనుషుల కంటే.., వారి తాలూకు జ్ఞాపకాలే మనతో చిరకాలం ఉంటాయేమో..!

మనిషి   మారటానికి  వివిధ భావావేశాలు కారణం కావచ్చేమో.., కానీ  వారి  జ్ఞాపకాలు కి మాత్రం అవేమీ తెలియదు బహుశా అందుకే అవి సజీవమెన్నటికీ..!

“”మర్చిపోవటానికి   నీవేమీ కల లాంటి ఒక జ్ఞాపకానివి  కాదు.., నిత్యం స్పురణకొచ్చే వాస్తవానివీ..””!