..
madiki tochinadi...manasuki nachinadi.
Thursday 1 August 2013
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా .. ఈ నిదుర నీకు హాయినిచ్చు నిండు రేయంతా ..
పరుగు వొద్దు నీకు ఓ కాలమా... నీ తొందరకు రేయి కరిగిపోయెను ....
అలుపెందుకే నీకు ఓ వీవనమా ...నా తల్లి ముంగురులు తాకి నీ జన్మధన్యమయ్యేను....
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా.. ఈ నిదుర నీకు హాయి నిచ్చు నిండు రేయంతా.. !
తొంగి చూడకే నీవు ఓ స్వప్నమా ...నీ అలికిడికి నా పాప కనుపాపలు కదలాడెను....
అసూయ పడకే నీవు ఓ చంద్రమా.. నా తల్లి మోము చూడ నిండు జాబిల్లి కాదా....
నిదురపో నా తల్లి నిదురపోవమ్మా ...ఈ నిదుర నీకు హాయి నిచ్చు నిండు రేయంతా ...!!

Subscribe to:
Posts (Atom)