..
madiki tochinadi...manasuki nachinadi.

Sunday 9 June 2013


అరుణిమను   పులిమిన  ఆకశం ....
      అలసిన  సూర్యుని  విరామ పయనం...
             అలుపెరుగని  తరువు  వేచె చిరు ఝల్లు రాక కోసం...
                   అహో రాత్రుళ్ళు  వేచినా నువ్వు  రావని తెలిసి ... ఆహ్వానిస్తా  నేను నిను చేరే  చివరి క్షణం కోసం ....! 


   నన్ను విడిచి వెళ్ళిన నా ప్రాణం
నాతొ మాటలాడనన్నదా నీ మౌనం 
నీకై విలపించి  నా కన్నులాయెను సాగరం
ఆ కన్నీటి కెరటాలా రాగంలోనూ నీ నామం 

నన్ను చేసివేశావు ఓ శల్యం
నువ్వు రాక నిదురలేవనంటోంది నా నయనం 
నీ ఊహలాయెను ఓ జ్ఞాపకం 
ఆ జ్ఞాపకాలే నాలో నీకై రగిలే తీయ్యని గాయం 

నువ్వు లేవు అన్నాక  నే శూన్యం 
నాపై కరుణన్నదె లేదా ఓ ఆశా దీపం 
నే చూశాను శూన్యంలో  నీ రూపం 
ఆ రూపంలో కనిపిస్తుంది నా జీవిత గమనం