..
madiki tochinadi...manasuki nachinadi.

Thursday 27 October 2011




కాలనీలో...కాంతుల పండుగ ..
అరుణోదయ కాంతులతో భాసిల్లుతున్న భానుడు ,ఈ నాటి తన అస్తమయం తర్వాత ప్రజలన్దరూ....ఆశ్వయుజ  అమావాస్య తాలూకు చీకటిని తరిమేందుకు ,నరకాసుర వధ  గావించిన సత్యభామ ,శ్రీకృష్ణుల  విజయానికి  గుర్తుగా నగరాన్ని వేవేల విద్యుద్దీపాలతో అలంకరించి***, బాణాసంచాదులను పేల్చుతూ ...చంద్రుడు లేని లోటును భర్తీ గావిస్తూ.... ,తన వెలుగును కూడా సవాల్ చేస్తూ.....ప్రజలు ఎంతగా వేడుకలు జరుపనున్నారో .. అని మరింత ప్రకాశవంతంగా తన తేజస్సును ఎండ రూపంలో ప్రదర్శిస్తున్నాడు కాబోలు ........!
******
"ఐకమత్యం కాలనీ లో పిల్లలందరూ కొత్తబట్టలలో ధగ దగా మెరిసిపొతూ ...కొందరు బాణాసంచా ఇంకా కొనలేదని, తమ తల్లితండ్రుల్ని సతాయిస్తూ ఉంటే...., మరి కొంత మందేమో ముందే తెచ్చుకున్న మందుగుండు సామగ్రిని బాగా మండాలని ,వాటిని ఎండలో ఆరబెడ్తున్నారు***....ఆడవాళ్ళంతా ,ఆ కాలని పెద్ద సులోచన ఇంటికి త్వరత్వరగా తమ పనులు ముగించుకుని మరీ వెళ్తున్నారు ...వెళ్ళిన వారిని సులోచన మాత్రం ,కించెత్తుఅనుమానపు  చూపులతో గమనిస్తూ ...తెచ్చిపెట్టుకున్న  నవ్వుతో ***....,రండి ,రండి ....కూర్చోమంటూ ,ప్రశ్నార్ధకంగా ఆహ్వానిస్తుంది ..**అది 
చూసిన ఆడంగులు ఒకరికిఒకరు కళ్ళతో సైగలు చేసుకుంటూ ...ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు ..**
********
ఏం వదినా ....అన్నయ్యగారు ,పిల్లలూ కనిపించరేం?అన్నట్లు..."గుడ్ ఫుడ్"సూపర్ మార్కెట్ వాడు సరుకులు పంపుతానన్నాడు..,ఇంకా పంపనేలేదు వదినా ..., ఒకసారి నువ్వు ఫోను చేసి చెపితే త్వరగా పంపిస్తాదేమో..ఒక్క ఫోను చేసి ,నాకు ఈ సాయం చేసిపెట్టు  వదినా...అని వాణి ,గోముగా అడగటంతో .......,సులోచన ఊపిరి పీల్చుకుని ..,
ఓసీ ..ఈ మాత్రానికే మీరంతా వచ్చి మరీ అడగాలా ఏంటి...?అదెంత పనీ.....? అని తన పరపతికి తెగ మురిసిపోతూ,.**
ఫోను అందుకుని ,సూపర్ మార్కెట్ వాడిని పరుగులు పెట్టించి మరీ...సరుకులు తెప్పించింది ...!!
******
వ్యాన్ లోంచి దింపిన సరుకులన్నీ తన ఇంట్లోకే చేర్చడాన్ని  విస్తుపోయి చూస్తున్న సులోచన చేతిలోకి డెలివరీ బాయ్ తన చర్జీలతొ సహా ... 20 వేల రూపాయల   సరుకుల బిల్లును   ఉంచాడు ..**బిల్లు చూసిన సులోచన తత్తరపాటుతో, 
ఇదేమి చోద్యం ...?మీ సరుకులన్నీ..ఇక్కడ దింపడమేమిటి ..?పోనిలే ..దింపితే పరవాలేదూ ,,,...మరి ,వాటి బిల్లు నా చేతిలో పెట్టడమేమిటని తెగ నోచ్చుకుంటూ... సులోచన ప్రశ్నల వర్షం కురిపిస్తుంది...**!!
*******  
    అదేమిటక్కా... ప్రతి ఏడాదీ..దీపావళిని మనమంతా కలిసి ఎంతో  వేడుకగా జరుపుకుంటున్నాం  కదా...?అప్పుడు 
నువ్వు ,ప్రతి ఒక్కరికి..ఒక్కో పిండి వంట వండమని పురమాయించి ...ప్రతి ఏడాది మనమందరం  కలసి ఇలానే.. ఒక ఇంటిలోనే పండుగని జరుపుకోవాలని,...వచ్చే యేడు మీ ఇంట్లోనే ఈ పండగ జరుపుకోవాలని ...నువ్వు మా ఇంట్లోనే మీ అందరికి పిండివంటలు చెసిపెదతాననీ...**,అప్పుడు మీ ఇంట్లో ఎవ్వరూ పొయ్యి వెలిగిన్చరాదనీ...., నిర్ణయించావు  కదక్కా ...**మర్చిపోయావా....ఏమిటి?!అందుకనే నీ పెద్ద మనసుని కష్ట పెట్టటం ...మాకు అస్సలు
ఇష్టం లేక,పాపం నువ్వొక్కదానివే ...అన్ని పనులు ఎలా చూస్కోగలవని***....అంతో ఇంతో ..నీకు సాయం చేయాలని ...,నీ పేరు మీద సూపర్ మార్కెట్ లో సరుకులు ఆర్డర్ ఇచ్చేసామనీ...,తన కళ్ళను భూచక్రాల్లా  చకచకా తిప్పుతూ ...కొంచెం సులోచన గడుసుదనాన్ని   అనుకరిస్తూ ...కామాక్షి గత ఏడాది దీపావళిని స్పురణకు తెచ్చింది!
ఇక చేసేదేమీ లేక సులోచన ...తనలోని పిసినారితనపు గడసరి నయిజాన్ని,,,ఇన్నాళ్ళకు కాలనీ వాసులన్దరూ పసిగట్టేసారని.....,నోచ్చుకుంటూ..**తన పరువు పోతుందని జాగ్రత్త పడుతూ ..,తను చెవి దిద్దుల కోసం దాచుకున్న 20 వేల రూపాయలను ..సరుకుల బిల్లు కై చెల్లించక తప్పలేదామేకి ...!!
******
సులోచన ఇంట్లో కాలనీ ఆడవారంతా కలిసి ..కిలకిలా నవ్వుకుంటూ ...రకరకాల పిండివంటలు చేస్తుంటే ..సులోచన
ఆలోచనలు మాత్రం చిన్నపిల్లల చేతిలోని కాకరపువ్వోత్తుల్లా సుళ్ళ్హు తిరుగుతున్నాయి..***
**************
గత కొన్ని సంవత్సరాల నుంచీ ....ఆ కలనీ వాళ్ళ ఇళ్ళలో అతి చనువు తీసుకుని మరీ ..,ఏ ఒక్కరినీ వదలక ,,,ప్రతి
ఒక్కరికీ...కామాక్షి ..నువ్వు  కజ్జికాయలు *,చాముండి ..నువ్వు చెక్కిడాలు ...*,అనసూయకి అరిసెలూ ...*,
మంగ కి మైసూర్పాక్...***ఇలా తనకీ , తన భర్తకి ...పిల్లలకీ ...ఇష్టమైన వన్నీ ...ఆ కాలనీ వారికి పురమా యిస్తూ ,,  పైగా వారేమన్నా అనుకుంటారేమోనని   వారి మొహాన ఒక చిన్న చిచ్చు బుడ్డి  లాంటి చిరునవ్వు  పడేసి...,**
ఇవన్నీ ...నేనే స్వయంగా మీ అందరికి చేసిపెటాలను కుం టానర్రా ..... కానీ ,సమయానికి చేతిలో చిల్లి గవ్వ కుడా మెసలందే...!!***
********
అయినా నేను పండగ పూట ఏ పిండి వంటలూ..చేయకపోయినా ,మీరంతా అలా చూస్తూ వూరుకోరని ..మీ అన్నయ్యగారు అంటారమ్మాయ్...**అంటూ యిదిగో వచ్చే ఏడాది దీపావళి నాడు మాత్రం మీరంతా మా ఇంటి కి  వచ్చి , భోజనాలు చేసి పిండివంటలు తీసుకుని మరీ ..వెళ్ళాలి  సుమా ..అని  గత కొన్ని దీపావళి పండుగలు గడిపేస్తుంది మరి.....!

***సులోచన ఆలోచనలని పటాపంచలు చెస్తూ ...ఇదిగో  పిన్నిగారూ కొంచెం ఇలా వచ్చి ఈ గ్యాస్ సిలిండర్ మార్చి ,నిండు బండ పొయ్యికి పెట్టరూ..రాణి  ఆమెను పిలిచింది .**అది విని ,అమ్మో ..అప్పుడే నా గ్యాస్ సిలిండర్ కి కాలం   చెల్లిందా...అనుకుంటూ ..లోపలికి పరుగు తీసిన సులోచన  కళ్ళకి ఎదురుగా తయారైన రకరకాల పిండివంటలు దర్సనమిస్తున్నాయి . పిండివంటలు రెడీ అక్కా ..ఇంకా భోజనాలు సిద్దం చేయాలి ..అని  ఒకరు, నీకెందుకు శ్రమ వదినా ...మేము చూసుకుంటాంగా అని మరొకరూ ...అలా..వoటింట్లో హంగామా చేస్తున్న వారిని చూస్తూ  అలా నిలబడిపోయింది ఆమె!
                 మద్యహ్హ్నం అందరూ పిల్లా..పెద్దలతో సహా భోజనాలు ముగించుకుని...సులోచనకి ఇంట్లో కొన్ని అట్టిపెట్టి..,మిగతావన్నీ అందరూ పంచేసుకుని...తమతమ యిళ్ళకు తీసుకువెలుతూ....,వస్తాం సులోచనక్కా... ఎంత చక్కగా కుదిరాయనుకున్నావ్  పిండి వంటలూ....? అబ్బ రుచి అమోఘం ....,అద్భ్బుతం ....!వగైరా సులోచన దగ్గర సెలవు తీసుకున్నారు అన్దరూ ...***బైట పడట్లేదు కానీ ,సులోచన మొహం ఏడ్వలేక నవ్వు పులుముకున్నట్లుంది.
           
                 సాయంత్రం కాలనీ పిల్లలందరూ బాణాసంచా కాల్చటానికి సమయత్తమవుతుంటే ...,పెద్దలు వారిని వారిస్తూ...ముందుగా లక్ష్మిపూజ చెయాలనీ...,తరువాత తీపి తిని ...పెద్దల ఆశిస్సులు తీసు కొవాలనీ... అప్పుడు , మొదటిగా ఆముదపు చెట్టు ఆకుల తూడులతో తయారైన దివిటిలను కాల్చి ....,అప్పుడు పెద్దల సమక్షంలో బాణాసంచా కాల్చుకోవాలని...సూచించారు ,అందరి ఇళ్ళల్లో ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నా కూడా ...సులోచన మాత్రం ఏంతో దిగాలుగా యింట్లో ఓ మూలన కూర్చుంది...!


                   ******లక్ష్మి పూజలు ముగించుకుని కాలనీ ఆడవాళ్ళంతా కలిసి ,,సులోచన యింటికి  సందడిగా వస్తున్నారు ..వారిని చూస్తున్న సులోచన మనస్సులోనే ..యింకా మా యింట్లో ఏమి మిగిలిపోయాయో వీళ్ళకి ..అనుకుంటూ ,మొహాన్న కుసింత నవ్వు  పులుముకునీ , ఎంటమ్మా ...ఇలా వచ్చారు అని పలకరించింది.కానీ ,ఆమె అనుకున్నట్లుగా వారు ఖాళీ చేతులతో కాక ,,,వివిధ రకాల బాణాసంచా సామగ్రితో వస్తూ .. సులోచన పిల్లలకి అవి అందిస్తూ...సులోచన తో ...యిదిగో అక్కా  డబ్బులు ** ఇవి ఈ రోజు నువ్వు సూపర్ మార్కెట్ వాడికి  సరుకుల నిమిత్తం యిచ్చిన ౨౦ వేలు రూపాయలూ . మా అన్ని కుటుంబాలూ సమానంగా పంచుకున్నాం అక్కా..ఏదో కొంచెం ఆట పట్టిద్దామని...అలా మొత్తం నీతో ఖర్చు పెట్టించే నాట్డకామాడం అంతే..కానీ  నిన్ను బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు . ఈ డబ్బులు నువ్  దిద్దులు కొనుక్కోవడానికే ఉపయోగించుకో... అని వారు అనడంతో...,సులోచన ఆశ్చర్యం , ఆనందం కలబోసుకుని చాలా సంతోషించింది...అంతే కాదు సులోచన కళ్ళు, ఇన్నాళ్ళుగా.. వీళ్ళని ఇంతగా ఇబ్బంది పెట్టానా అని ,సిగ్గుతో చెమర్చాయి ..,అందరు ఇచ్చిన డబ్బును వద్దని తిరిగి ఇచ్చి వేస్తూ ..ఆమె అన్దరినీ ఆప్యాయంగా అనునయిస్తూ ..అమ్మాయిలూ ,ఇక నుంచీ ప్రతి పండుగ మనమంతా..కలిసి ఇలానే పిండి వంటలు ఒక దగ్గరే వండకునీ...ఒక దగ్గరే భోజనాలు చేసి..అది కూడా మా యింటిలోనే సుమా...!అంటూ మనమంతా ..కలసికట్టుగా దీపావళి పండుగ వేడుకలు జరుపుకుని .., .మన కాలనీ పేరు నిజంగా ఐకమత్యం కాలనీ అని నిరూపిద్దాం ..!  అని అనేసరికి ఇక ఆశ్చర్యపోవటం కాలని వాసుల వంతు అయ్యింది!  అలా కాలనీ వాసుల ఆనంద బాణసంచా పేలుళ్లతో ... అమావాస్య చీకటి కాస్తా ..పున్నమి వెలుగులను మరిపించింది ...*********! 


                 ************************************************************