మామిడి కొమ్మల తోరణాలు....
షడ్రుచుల మేళవింపు లోని
తీపి ,పులుపు ,వగరు,ఉప్పు,
చేదు మరియు కారములు....
గత సంవత్సర జ్ఞాపకాల ఆనవాళ్ళు...
నూతన సంవత్సరానికై
పంచాంగ శ్రవణాలు.....
సర్వేజనాః సుఖినో భవంతు
అంటూ పెద్దలు పలికే
ఉగాది ప్రవచనాలు.....
అందరికీ ఎల్లప్పుడు వుండాలని
ఆశిద్దాం ఆ భగవంతుని ఆశీర్వచనాలు.......!!