..
madiki tochinadi...manasuki nachinadi.

Thursday 19 September 2019


ఆవు మీద వ్యాసం తెలుగు లో వ్రాయాలి.
ఇది తెలుగు మాతృభాషను కలిగిన వారు బాగా వ్రాస్తారా, లేక తెలుగు నేర్చుకున్న ఇతర రాష్ట్రాల వారు బాగా వ్రాస్తారా???

మాతృభాషను కలిగిన వాడు రాసి నట్టు, ఆ భాషను నేర్చు కున్న వాడు సాధారణంగా బాగా వ్రాయలేడు.

హిందీ మాతృభాషను కలిగిన నాలుగు రాష్ట్రాల వారికి ఎక్కువ ఉద్యోగాలు రావడం లో ఉన్న మర్మం అదే.....

మనం ఉత్తరాది వారు హిందీ జాతీయ భాష అంటే అది ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి అని ఆలోచిస్తాం కానీ, ఎందుకు నేర్చుకోవాలి అని ఆలోచించం.....

దురదృష్టం ఏమిటి అంటే దక్షిణాది లో ఎక్కువ ప్రజలు మాట్లాడే భాష తెలుగు, కానీ వీరు హిందీకి వ్యతిరేఖంగా మాట్లాడరు.....

భారత దేశ లక్షణం *భిన్నత్వంలో ఏకత్వం*
హిందీ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ అది తప్పని సరి అంటే కుదరదు.....

ఏ భాష అయినా మనం రోజూ మాట్లాడే, ఉత్తర ప్రత్యుత్తరాలు, మెసేజ్ లు వంటి వి చేసే లెక్క అయితేనే అది పూర్తిగా మనకు వస్తుంది....

రోజు వారీ జీవితంలో ఒక భాష అవసరం లేనపుడు ఎంత నేర్చుకున్నా దానిలో ప్రావీణ్యం, ఆ భాష మాతృ భాష గా ఉన్నవారితో సమానము కాదు....

మరి ఇలాంటి అప్పుడు ఇండియాలో కేవలం నాలుగు రాష్ట్రాల భాషను జాతీయ భాష గా ఎలా చేస్తారు....

దక్షిణాది, ఉత్తర ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకించడానికి అదే కారణం....

మన జనరేషన్ చాలా నష్ట పోయాం, ఇప్పుడు మన పిల్లలు వంతు.....

జాతీయ స్థాయి విద్య ఉద్యోగ పరీక్షలలో మనం పరాయి బాషలలో (హిందీ, ఇంగ్లిష్) పరీక్షలు వ్రాస్తుంటే, ఉత్తరాది వారు చక్కగా వారి మాతృభాషలో పరీక్షలు వ్రాసి మన విద్య ఉద్యోగ అవకాశాలు లాక్కుంటున్నారు.....

కళ్ళు తెరిచి ఆలోచించండి...

ముందు తరాలను అన్నా కాపాడండి.....

వేరే రాష్ట్రాల వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని అన్నా మనకు మనం ప్రశ్నించుకోండి.....



                                                             By
                                                          Kalyan..