..
madiki tochinadi...manasuki nachinadi.

Wednesday 1 March 2017

Silver jubilee.. our reunion


       
         
       25 సంవత్సరాలు... ఎవరు ఎక్కడ ఎలా ఉన్నామో తెలీదు! కొంత కాలంగా కలసి చదువుకున్నాం...,ఆడుకున్నాం పాడుకున్నాం...! స్కూలు చదువు ముగియటంతో అతి కొద్ది మంది మాత్రమే ఒకరిని ఒకరు వదలక స్నేహం కొనసాగించేవారు కొందరైతే, ఇంకొందరేమో మనకెందుకులే..మనమసలే మహా బిజీ.. అని తమ తోటి వారిని కూడా పలకరించని వారూ లేకపోలేదు..!
             మరల ఎవరికన్పించిందో కానీ..., ఇన్నేళ్ళ తరువాత మన బాల్య మిత్రులనందరినీ మరల మన స్కూలు ఆవరణలో, మనకి విద్యా బుద్దులు నేర్పిన మన ఉపాధ్యాయులను ...సత్కరించి.., వారి ఆశిస్సులతో పాటు తమ తాలూకు విథ్యా పాఠవాలనూ, తమ అల్లరి చేష్టలనూ గురువులతో కలసి నెమరు వేసుకోవటం నిజంగా... ప్రతీ మనిషికీ తమ జీవితకాలపు మథుర జ్ఞాపకాలను .., అందులోనూ ముఖ్యంగా బాల్య స్మృతులను తిరిగి తమ బాల్య మిత్రులతో పంచుకోవటం ఒక అనిర్వచనీయ అనుభూతి. పాతికేళ్ళ నాడు మనతో కల్సి ఆడుకున్న మన మిత్రులను నేడు చూడగానే ... చెప్పలేని ఆనందం ... ఈ క్షణాలు ఇలానే ఆగిపోతే బాగుండనిపించేటంతగా...!
       చిన్ననాటి స్నేహితుల ఆచూకీ తెల్సుకోవటం , ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో అని వారి జాడ కనిపెట్టే క్రమంలో ఎందరో జీవితాలతో నాకు భాథాకరమైన బాధ్యత పరిచయమయ్యింది.. కొందరు మనలోనే ఉంటూ, తమకంటూ ఒక ప్రత్యేకమైన దడి కట్టేసుకుని ఎలాగోలా బ్రతికేస్తుంటే.., కొందరు మనకందని తీరాలకి తరలిపోయారు కూడా..!
                        మా బడి ఆవరణలోకి అడుగిడుతూనే.., ప్రతి ఒక్కరి కళ్ళూ ఎవరెవరి కోసమో వెతక నారంభించాయి..,తమ చిన్ననాటి స్నేహితులను గుర్తించే వరకూ..! ఒకొక్కరు ఒక్కో విధంగా తమ స్నేహభావాల్ని కలబోసుకుంటున్నారు.. నువ్వు చాలా మారిపోయావ్ అని ఒకరూ.., నువ్వు అస్సలు మారలేదని మరొకరూ.!!!!!!