‘చెడు ‘పై ‘మంచి ‘ సాధించిన విజయానికి ప్రతీకగా దసరాపండుగను జరుపుకోవటం, పూర్వులు పెట్టిన ఆచారం! సైంటిఫిక్గా చూసినా కూడా.. ఈ సీజన్ లో రకరకాల అంటువ్యాధులు, విషజ్వరాలు వంటివి జనాలను పీడించకుండా.. పసుపు , వేపాకు , శమీ వృక్షం తదితరాలను( దుర్గాదేవిగా.., ( అనగా బాధలనునివారించునదని ఒక అర్థం ఉంది)భావిస్తూ)విరివిగాఉపయోగిస్తూ.. ఆయా రోగాలనుండి రక్షణ పొందటానికై అందరూఇటువంటి పండగల రూపంలో అయితే తప్పకుండా అటువంటియాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ వాడతారని పదిరోజుల పండుగలాగా డిజైన్ చేసి వుంటారు. ఇంకా.., మన సృష్టి మొత్తాన్నీ ఏదోఒక శక్తి నడిపిస్తుందని నమ్ముతుంటాం కదా..,( అది ఎవరికి నచ్చినరూపంలో, వారి ఇష్ట దైవం కావచ్చును) అలా ఆ శక్తి రూపాన్నిపూర్వులు కొందరు తమ మాతృమూర్తి గాఅభివర్ణించుకున్నారు.అలా,ఈ నవరాత్రుల రోజులలో స్త్రీ ని అన్నిరూపాలలో పూజించటం కూడా అనాదిగా స్ర్త్రీ ని వివిధ రంగాలలోప్రోత్సహించే క్రమాన లక్ష్మీ(finance), సరస్వతీ(education) etc... ఆచారాలు పుట్టి, నేడు తరాలు మార్పులతో ఆయా ఆచారాలుకూడా చాలా మార్పులు చెందివుంటాయి!
ఆచారాలన్నింటికి ఆమోదయోగ్యమైన కారణాలు ఉండాలి అని ఏమి లేదు....
మత పరమైన ఆచారాలకు, మత గ్రంధాలే ప్రామాణికం, సామాజిక అంశాలు కారణాలుకాకపోవచ్చు!