..
madiki tochinadi...manasuki nachinadi.

Wednesday 1 April 2020

దీనిని  మథ్యంతర’గతీ’.. అనాలా...??

       నేటి కరోనా కర్ఫ్యూ కాలంలో.., ప్రజలందరూ కనపించని శత్రువుకు భయపడి దాదాపుగా దాక్కొనే పరిస్థితులలో.. కొందరు చేతికి పనీ.. చేతిలో మనీ లేక అల్లాడుతుంటే..  తమ విలాసాలకు లోటైపోతుందనే వారు మరికొందరు..! అందరికీ అన్నీ ఉన్నా కూడా తాము ఎన్నో యిబ్బందులను ఎదుర్కొంటున్నామనే వాదన కొందరిదీ.!  ఇకపోతే... ఈ రోజు బాగా కలచివేసిన విషయం ఏంటంటే.., ఒక కుటుంబంలో పెద్దవయస్సావిడ కి  ఎన్నాళ్ళ బట్టో ఆరోగ్యం బాగా క్షీణించి మంచానే వుండే పరిస్థితి. ఆవిడ చనిపోతోందని ఇప్పటికి 4 సం,, ల నుండీ ఎదురుచూస్తున్నారు అనాలేమో..! కానీ ఆవిడకి ఇంకా పైనుండి పిలుపు రాలేదనుకుంటా. కానీ ఈ కరోనా హడావిడిలో ఆవిడకి వైరస్ సోకితే ఏమవుతుందో  అనే భయం కంటే, ఈ రోజులలో చనిపోతే ఎలాగో పాపం ఎవరికీ రావటానికి కూడా వీలుండదు.. సిటీ మొత్తం లాక్ డౌన్ లో వుందీ కదా అని ఆలోచన చేయనే చేయట్లేదు ఆ కుటుంబం..., పైగా తమకు వున్న పరపతికి ఆవిడ చనిపోతే, అందరికీ భోజనాలు వగైరా లాంటి వాటికి చాలా డబ్బును ఖర్చు చేయాల్సి వస్తుందనీ.., అదే నేటి కర్ఫ్యూ టైంలో అయితే, కర్మలకూ.. కాండలకూ ఖర్చులేకుండా.., ప్రజా హితార్థం అని చెప్పి,  అవన్నీ చేయకుండానే, తమ కుటుంబం వరకు ఆ తంతు కానిచ్చేయవచ్చను అనే వారి ఆలోచనకు , ఎలా రియక్ట్ అవ్వాలో అని నా మెదడు నాకు చెప్పడం మానేసి తాను ఆలోచించ సాగిందీ..!