..
madiki tochinadi...manasuki nachinadi.

Saturday 15 October 2011

bharatamaata..o..bharatamaata

ఎవరన్నారో తెలియదుగాని  భారతావనిని మహిళతో పోల్చి నిను  ,ఓ .. భారతమాత....!
స్త్రీ జాతిన  జమకట్టేరు కాన సహస్రపాళ్ళు..సహనానికే..పతాక ప్రతీక నీవు,ఓ.. భారతమాత...!
మరుభూమిని తలపించే మానవీయ దుస్చేర్యలను   బాధ పడక భరియించుమా నీవు ,ఓ...భారతమాత...!
భావి తరాల భవిత మాటేమో గానీ..బతికి బట్టకడితే చాలు ఆడ శిశువు బలిపశువు గాక..,
కాపాడుమా  నీవు ,ఓ ..భారతమాత....!
కర్మభూమి అన్నారేగాని మహానుభావులు,ఇదేమి ఖర్మం అని ప్రశ్నించే జనులు  నిను,ఓ.. భారతమాత......!
భూ బకాసురులు మొదలు ,ఏలికలు ..పాలికలూ ..ఏటేటా ప్రవృద్దమై ..తార్చుటకు సైతం
 తటపటాయించరు ..నిను  ,ఏమారక  జాగ్రత్త సుమా నీవు,ఓ.. భారతమాత..!
కులాల కుళ్ళు చిచ్చుతో చలిమంటలు కాచుకుంటూ ..మేమంతా భాయీ భాయీ ..అని కపట ప్రేమ నటియిం చేరు ,
అమ్మదనముతో వారిని  నమ్మకుమా నీవు ఓ భారతమాత..!
సాధ్వీ మణుల సహవాసము ,సాహస మూర్తుల ఘన త్యాగము ...వ్యర్ధము గానీయకుమా 
 దుగ్ధలను తరిమేందుకు..దగ్దమగు  ఈ ధరణిని సంస్కరింప  .. అపర దుర్గ వై రా నీవు, ఓ... భారతమాత...!!