..
madiki tochinadi...manasuki nachinadi.

Sunday 18 March 2018

ఉగాది పండుగ శుభాకాంక్షలు🙏🏻

అనగనగనగా.. ఉగాది అనే ఒక తల్లికి షడ్రుచులనే ఆరుగురు పిల్లలున్నారట! వారిలో పెద్దదైనతీపి’ ..అందరి కంటే నేనే గొప్ప.., అందరూ నన్నే ఎక్కువగా ఇష్టపడతారు అనే అహంకారం కలదై చాలా గర్వపడేది. ఇక రెండవదైనపులుపు’ .. నాకేం తక్కువా..? నేను కూడా అందరికీ చాలా ప్రీతిపాత్రురాలిని అనే గర్వంతో ఉండేది. తరువాత మూడవదైనకారంఅయితే.. అందరికీ ఎవరి పట్లమమకారంఉప్పొంగినా .., విందులో నేను తప్పక ఉండి తీరాల్సిందే అని గర్వించింది..! ఇక నల్గవదైనఉప్పు’ ... అసలు నేను లేనిదే మనిషులకు జిహ్వ లేనట్లే అంటూ దర్జా ఒలికించింది..! ఇక ఐదవదైన అయినవగరు’... తాను లేనిదే.., జీవరాశికి జఠరాగ్ని ప్రసన్నం కాబోదని..అందరికంటే తానే ఎక్కువ గొప్ప అనీ... వాదించింది! చివరిగా , ఆరవదైనచేదుమాత్రం.. ఏమీ మాట్లాడక మౌనంగా ఉండుట చూసిన మొదటి ఐదుగురూ.., నీకు ప్రత్యేకత ఏమీ లేక పోగా మనుషులు అందరూ నిన్ను అసహ్యించుచూ నిన్ను దరిచేర నివ్వరనుచూ.. హేళన చేసిరి..! అప్పుడు చేదు చిరునవ్వుతో...” మనుషులందరూ మితిమీరి మిమ్మలను తిని, వారి ఆరోగ్యాన్ని పాడుచేసుకొనే సమయాన వారి ప్రాణాలను కాపాడేసంజీవనినిఅవటం నాఅదృష్టం అని సమాధాన మిచ్చింది! సంభాషణ విన్న వారి తల్లి.., మీరందరూ ఎవరికి వారు చాలా ప్రత్యేకత కల్గినవారే..! కానీ మీరందరూ ఒకే తల్లి బిడ్డలనే విషయం మరువకూడదు.., మీరందరూ కలసి ఉంటేనే , ఛైత్రాన వచ్చే అస్వస్థతలనుండి మానవులను రక్షింపగలరని.. “కలసి ఉంటే కలదు సుఖంఅనే సూక్తిని గుర్తు చేసింది !!! 
     💐మీకూ మీ కుటుంబ సభ్యులకూ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻💐