..
madiki tochinadi...manasuki nachinadi.

Saturday, 4 April 2020

ఐక్యత లేక మతమా...??

ఒక క్లాసులో ఒక టీచరు పిల్లలకి  పాఠం  చెప్త్తూ,”పిల్లలూమీరందరూ   దేవుని బొమ్మను గీయండి “. అని తగిన టైం ఇచ్చిచూస్తున్నారట.   ఆ క్లాసులో వున్న భిన్న మతాలూ.., సంస్కృతులూకలిగిన పిల్లలందరూ తమ తమ కుటుంబంలోని అందరూఅనుసరించీ నమ్మేటటువంటి దైవం యొక్క బొమ్మనే తమకొచ్చినవిధాన వేసి చూపించారట. అలాగని, ఆ పాఠం నేర్పే క్లాస్ టీచరుచెప్పారు కదా అని టీచరుకి  ఇష్టమైనటువంటి లేదా టీచరుమతానికి సంబంధించిన దేవుని బొమ్మను గీయలేదు! వారుపుట్టినప్పటి నుండీ అనుసరిస్తున్న దైవాన్నే గుర్తు చేసుకుని ఆబొమ్మనే గీసారు. అలాగని పిల్లలందరూ ఒకే రకమైన బొమ్మనుమాత్రమే గీయండని , ఆ టీచరూ ఆంక్షలు పెట్టలేదు! ఇక్కడ టీచరుఆలోచన ఏమిటంటే.. ,  ఆ పిల్లలందరి చేతా ఐక్యతగా విద్యనునేర్పించాలి అంతే..! మరి పిల్లలందరు కూడా టీచరు నుండినేర్చుకోవాలనే నిబద్ధత మాత్రమే కలిగివుండటం! ఆ నిబద్ధతకోసమే సదరు టీచరుని నియమించడం కూడా..!

No comments:

Post a Comment