..
madiki tochinadi...manasuki nachinadi.

Wednesday, 23 November 2011

waiting...4...u

వేచి ఉంటా నీకై...వేచి వేచి....వేయి జన్మల వరకు...!

వేచి ఉంటా నీకై...ప్రభాత ఉషస్సుకై  వేచే, వేకువ నిసీధీలా...!

వేచి ఉంటా నీకై...లహరి స్పర్స కై వేచే, సాగర తీరంలా....!

వేచి ఉంటా నీకై ...శశి రాక కై వేచే, కొలను నడుమ కలువలా...!

వేచి ఉంటా నీకై ....చిరుజల్లు కై వేచే,  దాహార్తి  ధరిత్రిలా ...!

వేచి ఉంటా నీకై...వేచి వేచి...., వేయి జన్మల వరకు....!

neekaii... nenuu....

   
 వేనవేలు వేడుకోలు ప్రియతమా...నీకు వీడుకోలు పలికే ఈ దుస్స్థితి సమయాన...
      వెల్లువెత్తే మదిన  విన్నపాలు ప్రియతమా...నీ వెంటే నా ఉనికి ఇహ పర లోకాలెందైనా....
               వేయిన్నొక్క జన్మాలకైనా ప్రియతమా...వేరుచేయబోదు  మనలను ఏ  విధి వక్రీకరించినా....
                       వేచి వెనుకాడను  ప్రియతమా....నువ్ తిరిగి రావని తెల్సి  ఆత్మార్పణము కైనా...!!