తనని ఎంతగా గుర్తుకు తెచ్చుకోవచ్చునంటే... లెక్కపెట్టలేనన్ని సార్లుతలుచుకొనేంతగా...!!
తనపై నమ్మకాన్ని ఎంతగా వుంచాలంటే...
అనుమానానికి తావేలేనంతగా...!!
తనకై ఎంతగా ఎదురు చూడొచ్చునంటే...
అసలు సమయాభావమనే భావన లేనంతగా..!!
తనని ఎంతగా ఇష్టపడాలంటే...
అసలు అయిష్టత అనే మాటే మరిచిపోయేంతగా...!!