..
madiki tochinadi...manasuki nachinadi.

Saturday 25 June 2022

అంతం లేని తీరం

అలలై  ఎగసిపడే   ఆలోచనలు కోకొల్లలు..

అందని   తీరానికై   అహర్నిశలు పయనించే ..,సాగర లహరికలు..!!

అలుపే ఎరుగని , అంతం తెలియని  ఊహలు ఎప్పటికీ ఎన్నటికీ తీరం చేరబోవేమో..!!

Monday 6 September 2021

నీకై...

తెంచేసుకుంటే ,తెగిపోయేంతటి బలహీన బంధాలను... నేను  ఏర్పరుచుకోలేదు...!

తెగించి  ,త్వరపడేంతటి బలమైన బంధాన్నీ ..బ్రతుకు నాకు ఏర్పరచలేదు...!

తెగించలేక..., త్యజించలేక...  నీ భాషలో ఊగిసలాట..!

నాకదీ..........!!

Tuesday 19 January 2021

ప్రామాణికత

తనని ఎంతగా గుర్తుకు తెచ్చుకోవచ్చునంటే... లెక్కపెట్టలేనన్ని సార్లుతలుచుకొనేంతగా...!!

 తనపై నమ్మకాన్ని ఎంతగా వుంచాలంటే...

అనుమానానికి తావేలేనంతగా...!!

తనకై ఎంతగా ఎదురు చూడొచ్చునంటే...

అసలు సమయాభావమనే భావన లేనంతగా..!!

తనని ఎంతగా ఇష్టపడాలంటే...

అసలు అయిష్టత అనే మాటే మరిచిపోయేంతగా...!!

Friday 25 September 2020

 అలా వెళిపోతే ఎలా...

మీ గొంతులో దాగి వున్న అమృతాన్ని, మరణాన్ని జయించేందుకు కడుపులోకి మింగకపోతే ఎలా...

అలా వెళిపోతే ఎలా...

ఎందరి హృదయాలకో  మీ గాత్ర స్వాలంబన అందించి, మీ హృదయ స్పందనను అర్ధాంతరంగ ఇలా ఆపేస్తే ఎలా...

అలా వెళిపోతే ఎలా...


Thursday 10 September 2020

కాలయవనిక’

కలయైన ఇలయైన  కదిలిపోయే క్షణమాగక 

కావలి కాయగ లేక కాలయాపనకు కాసేపు నిలుపనులేక

క్షణవీక్షణకు తావీయదిక

కలల అలలాంటి 

కాల్పనిక కాలయవనిక...!

Thursday 16 July 2020

కరోనా...

 నాడు కలసి ఉంటే కలదు సుఖమన్నారు ..
 నేడు కదలకు సుమా కాపాడుకో నీ ప్రాణమన్నారు..!
నాడు  అక్కున చేర్చుకునే  ఆలంబనే అదృష్టమన్నారు..
నేడు అస్సలు తాకరాదు సుమా ఆరోగ్యప్రదమైన ఆరడుగుల దూర పలకరింపులు మేలన్నారు...! 
కలికాలమంటారొకరూ.../ కరోనా కాలమొచ్చేసిందనొకరూ...!!

ముందూ.. వెనకా..!!?

ఎప్పటికైనా తప్పదు .. ఎవ్వరికైనా తప్పదు..

ఎలాంటి వారికైనా తప్పదు.. ఎక్కడి వారికైనా తప్పదు..

ఎంతటి జాగురతతో మెలిగినా తప్పదు.. 

ఏపాటి  ఏమరుపాటు కలిగినా తప్పదు..

ఏమనాలో నిన్ను ..,మరణమని అనేసి మరిచిపోవటానికి 

మనమధ్య  మమతలను వాటి తాలూకు మనుషులకు..

రణరంగానికేగే సైనికులకు సైతం మరణం తప్పదు...!