..
madiki tochinadi...manasuki nachinadi.

Sunday, 23 October 2011

అభిసారికా..... నను  ఎలుగెత్తి చాటనీ...ఆ బ్రహ్మ చేసెను ..,నిను  నా కొసమేననీ.....!!


        ఇది విధి కానుకా....,ఓ అపరంజీ...నిను పొందని నాకు మరణమే ఇక శరన్యమనీ..... !!


                 కడసారిగా...నా కనుల కాంచనీ...నీ దివ్య మనోహర  రూపాన్నీ.....!!


                        నీకు వివరింపగా ...నా యదలయనీ...,మరుజన్మలో నీవే నా సర్వస్వమనీ...!!

Saturday, 22 October 2011

పున్నమి రాత్రి జాబిలిని చూడు ...ఆ వెలుగులో నేనుంటా..**

వేకువ జామున సూర్యుని చూడు...అరుణ వర్ణమై నేనుంటా..**

ఉరిమే మేఘపు వర్షం చూడు...ఆ చినుకు బిందువులో నేనుంటా..**

కురిసే మంచు బిందువు చూడు...ఆ చల్లని స్పర్స లో నేనుంటా..***

నీ గుండె తలుపు తట్టి చూడు..ఆ హృదయ సవ్వడిలో నేనుంటా...**

ప్రతి క్షణం నీ నీడై ఉంటా...అనుక్షణం నీకు తోడుగ ఉంటా...***!!       

Saturday, 15 October 2011

bharatamaata..o..bharatamaata

ఎవరన్నారో తెలియదుగాని  భారతావనిని మహిళతో పోల్చి నిను  ,ఓ .. భారతమాత....!
స్త్రీ జాతిన  జమకట్టేరు కాన సహస్రపాళ్ళు..సహనానికే..పతాక ప్రతీక నీవు,ఓ.. భారతమాత...!
మరుభూమిని తలపించే మానవీయ దుస్చేర్యలను   బాధ పడక భరియించుమా నీవు ,ఓ...భారతమాత...!
భావి తరాల భవిత మాటేమో గానీ..బతికి బట్టకడితే చాలు ఆడ శిశువు బలిపశువు గాక..,
కాపాడుమా  నీవు ,ఓ ..భారతమాత....!
కర్మభూమి అన్నారేగాని మహానుభావులు,ఇదేమి ఖర్మం అని ప్రశ్నించే జనులు  నిను,ఓ.. భారతమాత......!
భూ బకాసురులు మొదలు ,ఏలికలు ..పాలికలూ ..ఏటేటా ప్రవృద్దమై ..తార్చుటకు సైతం
 తటపటాయించరు ..నిను  ,ఏమారక  జాగ్రత్త సుమా నీవు,ఓ.. భారతమాత..!
కులాల కుళ్ళు చిచ్చుతో చలిమంటలు కాచుకుంటూ ..మేమంతా భాయీ భాయీ ..అని కపట ప్రేమ నటియిం చేరు ,
అమ్మదనముతో వారిని  నమ్మకుమా నీవు ఓ భారతమాత..!
సాధ్వీ మణుల సహవాసము ,సాహస మూర్తుల ఘన త్యాగము ...వ్యర్ధము గానీయకుమా 
 దుగ్ధలను తరిమేందుకు..దగ్దమగు  ఈ ధరణిని సంస్కరింప  .. అపర దుర్గ వై రా నీవు, ఓ... భారతమాత...!! 


Wednesday, 12 October 2011

haasiniii





మదుర హాసినీ ...నీ చిరునవ్వు  ముద్రితమయ్యే  నా మనోఫలకాన ....***

ముత్యాలూ..,మల్లెలు దోర్లేనే.....నీ దరహాస  జలపాతాన...***

మరపు రాని నీ ...చిరునగవు  అలలై ..,తాకేనే  ...నా హృదయాంతరంగాన...********

 మహిన మహా  హాయి  గొల్పే ...,నీ స్మితాజాలమునకై  తపస్సు చేయరే ...ఎంతవారలైనగాన.....*****






























Tuesday, 4 October 2011

jarigenaaa?


"పదముల వేగాన్ని పాదములు చేరేనా"***.....?
"ఉషస్సు తేజాన్ని నిశీధి తాకేనా"****.....?
"మెరుపు పరుగుల్ని మరుపు నేర్చెనా"***....?
"తలపుల రెక్కల్ని తలుపులు ఆపేనా"***...?
"కన్నీటి విలువల్ని పన్నీటితో పోల్చతగునా"...***?

"బంధాలన్నీ విరచిత ప్రభందాలుగా మారేనా"***...?

Wednesday, 21 September 2011

ప్ర జ్వరిల్లె  ప్రేమమూర్తి ....ప్రకాశించే జ్ఞానదీప్తి !
స్పూర్తి ప్రధాత్రి .....ప్రీతి పరమార్ది.....!
కమనీయ చరితార్ది...కరుణా విలాస నేత్రి...!
క్షమయా ధరిత్రి.. సహనశీల సుమదాత్రి...!
తాపస్య నిరంతర విధ్యార్ధీ...సద్గునాల    సముద్భవ మైత్రీ...!
అరుదైన అందాల ప్రత్యర్ధి..జాలి సుగుణాల  దయార్ది...!
మృదులిక స్వర గాత్రి...మందస్మిత మనోహర దివ్య మూర్తి...!











 ఓ స్త్రీ జాతీ... అజరామము అవనియందు...ఘనమైన నీ కీర్తీ.... !

Tuesday, 13 September 2011

వెన్నెల వెలుగులు రాత్రికి ఇష్టం .........,
స్వాతి చినుకులు తామరకు ఇష్టం......., 
పచ్షని పైరు పుడమికి ఇష్టం......,
నీ చిరునవ్వుల సోగసేమో నా మనసుకి  చాలా ఇష్టం...!