..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday, 22 January 2019

నీ మాటలకి,ఎప్పుడూ ఎంతగానో కోపం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా..!
 కానీ ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమవుతుంటా...!
ఎందుకలా అన్నావా అని ఆలోచించేలోపే..., ఎలా ఇంత బాగా చెప్పగలిగావా అని మాటలతో మమేకమైపోతుంటా...!
బహుశా నువు తిట్టినా అదేదో మహా కావ్యం లా పదిసార్లు చదువుకునీ.., భలే చెప్పావు కదా అనుకుంటున్నా..!
నేను నాకే సరి కొత్తగా కనిపిస్తున్నా...! ఈలోపే నేను నిజంగా ఇదా.., అని ఆశ్చర్యపోతున్నా...!

ఇంకా ఎలా ఎలా మారబోతున్నానో ఏంటో.. అనుకుంటున్నా..!

Thursday, 17 January 2019

భయంకరమైన పెద్ద గుండె కోత ఏమిటంటే......,
        జ్ఞపకాలను మరిచిపోలేక పోవడం..!
            మరిచిపోయామనుకుంటాం కానీ..,
                మతిలేని    మనసుకు  మరపు ఉండదేమో..!!

Tuesday, 8 January 2019

నా నీడవైతే నిన్ను విడిచి చీకటిలో బ్రతికేయవచ్చూ...,
నా కలవైతే నిదురకు దూరంగా ఉండిపోవచ్చూ..,
నా ఊహవైతే బరువెక్కిన హృదయంతో వెలివెసేయవచ్చూ..,
నా కన్నీరువైతే ఇంకిపోయేవరకూ విలపించవచ్చూ...,

నా ఊపిరే నువ్వైనప్పుడు ఎలా వదలను కడవరకు నీ నేస్తాన్ని????!!!
ఏమిటో..ఏంటో ఇదీ.. ఇదివరకెన్నడూ ఎరుగనిదీ...!!
ఎంత వద్దను కున్నా.. అంతగా కావాలనిపిస్తావు...!
 ఎంతో దూరంగా ఉన్నావ్ అనుకున్నా..అంతకంటే దగ్గరయి కనిపిస్తున్నావు...!
ఎందుకో తెలియదు.. ఎలానో తెలియదు..,
ఎవరికీ తెలియని నా ప్రపంచంలోకి యథాలాపనగా వచ్చేసావు...!

ఏమిటో..ఏంటో ఇదీ.. ఇదివరకెన్నడూ ఎరుగనిదీ..!!!

Monday, 7 January 2019

నువ్వు కలవైపోతే బాగుందేడి..., 
నా కన్నులను తెరవకపోదును..!
నువ్వు  మెలకువ ఐనా బాగుండేది..,

నా కన్నులను మూయకపోదును..!

Sunday, 6 January 2019

బరువెక్కిన గుండెకు భోరున ఏడ్చే వెసులుబాటు ఇవ్వని బిజీ బ్రతుకు... !
బలవంతపు నగవులతో బహుబాగు నటనలకు బదులు యివ్వలేని అయోమయపు మనస్సు..! 
బరువును ,మోసీ మోసీ.. బాధ కూడా..బలిష్టమైపోయింది..!

బతుకు బరిలోన భలే పోరాటం భూమి మీద పడినంతనే, భారీ ప్రహసనం.!

Friday, 4 January 2019

బంధాలు ఎంత బలమైనవో...
అంతే బలహీనమైనవి  కూడా....
ప్రేమను పంచగలవు...

మనసును తుంచగలవు...