వసంతం ముందే వచ్చేసింది..😍
ఒక కొమ్మ మీద నుండి తాను ప్రియాతిప్రియంగా గొంతు సవరిస్తే.., అంతే మథురంగా.. తన ప్రియురాలికి బదులిస్తూ టక్కున ప్రత్యక్షమయ్యింది ఆ మగ కోయిల! ఇక ఆ కోకిల జంట తమకు ఈ ప్రపంచంతో పనేముందనుకున్నాయేమో..., ఒకటే పాటలూ.. తనివి తీరని మాటలూనూ..! అంతగా ఆనంద సంగీతంలో మునిగి తేలుతూ.., మధ్య మధ్యలో వేప పూతని కూడా రుచి చూస్తున్న ఆ కోకిల జంటని మా వేపచెట్టు పై చూసి .. నన్ను నేనే కాసేపు మైమరచిపోయాను..!😍
No comments:
Post a Comment