..
madiki tochinadi...manasuki nachinadi.

Sunday, 25 August 2019

*రాష్ట్రం పాలిట మరో సమ్మెట దెబ్బ.....*

రాష్ట్ర విభజనతో మెట్రో మహా నగరం అయిన హైద్రాబాద్ ను నష్ట పోయి విద్య ఉద్యోగవకాశాలు కోల్పోయిన ఆంధ్రా యువత, ఒక విశ్వ నగరం (చెన్నై, బెంగళూర్, హైద్రాబాద్ లాగా)  కావాలని ఆశపడితే ఇప్పుడు దగా పడి మరో దశాబ్దం వెనకబాటుకు వెళుతున్నారు...

వికేంద్రీకరణ అనేది అధికార విభజనలో ఉండాలి కానీ ఇలా ఒక నగరాన్ని నాలుగు ముక్కలు చెయ్యడంలో కాదు....

ఇలా నాలుగు రాజధానులు చెయ్యడమే వికేంద్రీకరణ అంటే.... నాలుగు రాష్ట్రాలు, నలుగురు ముఖ్య మంత్రులను నాలుగు చోట్ల ఎన్నుకుంటే ఇంకా బాగా పరిపాలన చేస్తారు, వికేంద్రీకరణ ఇంకా చక్కగా జరుగుతుంది....

తుగ్లక్ పరిపాలనను గుర్తు చేస్తున్నాడు.....

ఎక్కడైనా ఇలా చేసి అభివృద్ధి చెందిన దేశాలు,రాష్ట్రాలు ఉన్నాయేమో చూపించాలి....

చంద్రబాబు చేసింది నేను రూపు మాపుతాను అనే జగన్ పిడి వాదం రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పు.....

చంద్రబాబు చేసింది తప్పు అయితే నిరూపించి శిక్షించండి అంతే కాని ఇలా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆదుకోవడం ఏమిటి.....

ఇప్పటికే మన రాష్ట్ర యువతకి విద్య వ్యాపార ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి, ఏ చిన్న అవకాశానికి అయినా బెంగళూర్, చెన్నై, హైద్రాబాద్ వెళ్ల వలసి వస్తుంది. అదే మనకు కూడా ఒక విశ్వ నగరం ఏర్పడితే ఆర్థిక స్వాలంబన ఏర్పడి ప్రపంచ గుర్తింపు వస్తుంది. అంతేకాని ఈ విధమైన ఒంటెద్దు పోకడలు రాష్ట్ర, యువత భవిష్యత్తుకు మంచివి కావు.....
                                By.. K.K.Ram/..

Sunday, 4 August 2019

కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది....

అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.

కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.

నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి.

అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది.

మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.

కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది..

నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...


Monday, 22 July 2019

స్త్రీ
-----
మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...
"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".

ఆప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి...ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ సృష్టి. వివక్ష తగదు. మొండికేసే
పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.

"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది.
"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.

ఆప్పుడు దేవుడు "ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.

"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.

అప్పుడు దేవుడు "ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.

దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.

అప్పుడు దేవుడు "అదా...కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.

దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.

అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."
చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని..!😏😏

Saturday, 20 July 2019

భానోదయం..🌅

అరుణోదయ  కిరణాల  మేలుకొలుపుతో    అరవిరిసినమందారాలతో    పోటీపడుతూముచ్చటగొలిపే    మోముతో    ఆరేళ్ళవయసున్నఉదయ..తమ  వాకిట్లోఅసహనంగా  అటూ  ఇటూతిరుగుతూ.. , ఎదురింటి  వైపే  అస్తమాను  చూస్తూనే    ఉంది..  ఇది  గమనించిన  ఉదయ  తల్లిసురేఖ  తనకూతురి  మోములోనిభావాన్ని   గ్రహించి  కూడా..ఏమీతెలియనట్లు  తనపనిలో    తానుమునిగిపోయిందీ..!
           
                బంగారుఛాయతో  కలగలిసినగులాబీ 
         పువ్వుల  డిజైనుగలఅందమైన  ఎత్తుమడమలచెప్పులువేసుకొని,  వాటిని    చూడటానికైసగంకి  పైగా  వంగిన  నడకతో  ప్రపంచంలో  తనంత  సంతోషివేరెవరూ    ఇక    ఉండబోరేమోఅనిపించేలాఆడుకుంటున్న  భాను.. తనతల్లిపిలుపుతోఒక్కసారిగలోకంలోకివచ్చిందీ..

       భానూ... నువ్వట్టావయ్యారాలుబోతావుంటేపన్లెట్టావుతాయీ... ఎల్లి పెద్దాపోరివాకిలిచిమ్మిరా  పో... అనే  తల్లిమాటకి  అయిష్టంగానేతలూపుతూ... తన  అపురూపమైనచెప్పులనుతీసిజాగ్రత్తపరచమని  తల్లికి    అందించింది
    
      భాను తల్లి రమ చేతిలో వున్న చెప్పులు చూసిన ఉదయ..., వెంటనే.. “ఆ చెప్పులు నావీ.. మీ భాను తీసేసుకుందీ.”.. అని ఫిర్యాదు పూర్వకంగా..  తన అసహనాన్ని వెలిబుచ్చింది.! ఆ మాటలు విని  బయటికొచ్చిన సురేఖ తన కూతురును మందలిస్తూ.. స్వయంగా తానే, ఆ చెప్పులను భానుకి ఇచ్చినట్లూ.. పైగా అవి తన చెప్పుల జతను పోలినటువంటి మరొక కొత్త జత అనీ చెప్పుకొచ్చింది. తమ జీవనశైలి వగైరా మిగతా ఎన్నో విషయాలలో ఎంతో వ్యత్యాసం గమనించిన భానుకి,  తనతో సమానంగా ఉదయకు కూడా  ఒకేరకమైన చెప్పులు కొనివ్వడంతో..తన తల్లి 
తీరు అస్సలు నచ్చలేదు...!

Friday, 19 July 2019

ఆకశాన ఏకాకి మేఘపు శోకానిదా ఈ వానా...
అలుపే ఎరుగని పుడమి ఎదురుచూపుల ప్రతిఫలమా ఈ వానా..

Sunday, 7 July 2019


మర్చిపోవటానికి  నువ్వేమీ  కలలాంటి    
ఒక  జ్ఞాపకానివి  కాదు.., 
నిత్యం  స్ఫురణకొచ్చే  వాస్తవానివీ..!


Sunday, 30 June 2019

అలలై  ఎగసిపడే  ఆలోచనలుకోకొల్లలు..
అందని  తీరానికై  అహర్నిశలుపయనించే..,సాగరలహరికలు..!!