..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday, 11 June 2019

మనసు గాయపరిచారని.., మనుష్యులను దూరం చేసుకుంటామా...? అలా  చేస్తే, మనుషులు దూరమవ్వొచ్చేమో గానీ.., సమస్య దూరమవ్వబోదు..!
ఎటువంటి సందర్భాలలో అంత ఖఠినంగా మాట్లాడారో అర్థం చేసుకోగలిగితే, నూటికి తొంభై శాతం మనస్పర్థలు రానేరావేమో...!

Monday, 10 June 2019

“”నవ్వే ప్రతి చిరునవ్వు గుండెలోని సంతోషాన్ని చూపించదు.....

అపరిమితమైన కోరికలు, సంతృప్తిపడే ఆనందాలు కంటే ఆశ్చర్యకరమైన అనుభవలనే మిగులుస్తాయి....””


లంచం ఇవ్వడం నేరం, కానీ ఇస్తాం కొన్ని సార్లు.....
కట్నం ఇవ్వడం నేరం, కానీ ఇస్తాం.....

ఇలా మంచి చెడు అనేది మనం నిర్మించుకున్న పద్ధతుల మీద ఉంటుంది....

కట్నం ఇచ్చామనో, లంచం ఇచ్చామనో మనం మన పిల్లల, పక్క వారి జీవితాలనో నాశనం చెయ్యడం లేదు కదా.....

కొన్ని ఇలానే ఉంటాయి.....

ప్రపంచం, చట్టం వాటిని తప్పు అని అంటుంది కానీ అలాంటివి జరుగుతానే ఉంటాయి....





మన మనసుకి నచ్చింది చెయ్యడం అన్నింటికంటే ముఖ్యం, ఎందుకంటే మన సంతోషము కూడా మనకి ముఖ్యమే, కానీ అది ఎదుటివారిని ప్రత్యక్షంగా భాదించకుండా ఉంటేనే.....

Friday, 24 May 2019

నిజంగా ప్రేమించి చూడు.. అప్పుడే,,
నిను వీడిపోవాలనే ఆలోచనే రానే రాబోదు..!
నిజంగా ప్రేమించి చూడు..అప్పుడే,,
నిను వదులుకోలేని  ఆదుర్ధా అర్థం కాబోదు..!
నిజంగా ప్రేమించి చూడు...అప్పుడే,,
నిను ఇష్టపడే వారికి నీ మరణాన్ని ఊహించటం
ఎంతటి నరకమో  అర్థం కాబోదు..!
నిజంగా ప్రేమించి చూడు...అప్పుడే,,
నిను నీకంటే కూడా ఎక్కువ ఇష్టపడేవాళ్ళు
ఉంటారని తెలియకబోదు...!





Wednesday, 1 May 2019

ప్రతి మనిషి జీవితంలో.. ఇలా ఒకరు ఉంటారేమో..!
వారిని పొందలేరు..,
అలాగని వదులుకోలేరు..!
వారితో మాట్లాడలేరు..,
వారిని మరిచిపోలేరు..!
వారిని కలుసుకోలేరు..,
కానీ తమ జీవితం నుండి వెలివేయలేరు..!