..
madiki tochinadi...manasuki nachinadi.

Friday, 5 April 2019

కావలనిపించే కరుణవు....
కలతను మానిపే కాంక్షవు....
కళ్లతో మాట్లాడే కెరటానివు....
కలగా నిలిచే కోరికవు....
కౌగిలి కోరుకునే కౌముదివు....
కవితలు మెచ్చే కావ్యానివు....
కాల్చుకు తినే క్యాన్సర్ నీవు..

Saturday, 30 March 2019

सबसे ज्यादा तकलीफ् वो लम्हें देतें है...,
जब आॉख के अॉसू चुपाकर मुस्कुराना पडता है...!

Friday, 22 March 2019

ఆకశాన ఆశావహివా నీవు...,
ఆత్మీయ ఆలంబనవా నీవు..,
ఆప్యాయతా ఆకాంక్షివా నీవు..,
ఆశయానికై   అమోఘ ఆదుర్ధార్తివా నీవు..,
ఆనందాల ఆశ్లేషివా నీవు..,
ఆకళింపవని అజాతశత్రువా నీవు..,
ఆక్షేపింపని ఆసరావా నీవు..,

చిరునవ్వుకు అర్థం బాధలేమీ లేకపోవడం కాదు.., సమస్యలని ఎలా ఎదుర్కోవాలో.. బాధల్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలియడం..!!

Tuesday, 19 March 2019

మొదటి సారి అమ్మాయి పుట్టిందని , లక్మీ దేవియనీ.. మురిసిపోతూనే...( నటిస్తూనే), తన మొదటి వేడుకలో ఆ పాప తలపై అక్షంతలను ఆశీర్వచనాలుగా... నీ వెనుక తమ్ముడిని తెచ్చుకోమ్మా బంగారు తల్లీ యని దీవెనలు ఇచ్చే మనం .. ఆ పాప భవిష్త్యత్తు బాగుండాలనే తాపత్రయం కంటే.., తర్వాతనైనా మగబిడ్డ మాత్రమే పుట్టాలనే కోరిక యొక్క బలీయత , బాధిస్తుందీ..🤦🏻‍♀️






 మార్పు  ఎలా వస్తుందో...,,, ఏ విధంగా మనం మారతామో ..!!

Thursday, 14 March 2019

నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి ప్రాణం ఇవ్వాలట..!
నిన్ను విడిచి వెళ్ళాలనుకునే వారికి  మనం తప్పుకుంటూ..,దారైనా ఇవ్వాలట..!

Friday, 8 March 2019

భగవంతుడు అంటే.., ఏమైనా మన క్రింద పని చేసే ఎంప్లాయా..?!
 మొక్కుబడుల రూపంలో,నీకు పే చేస్తాం.., మాకు ఆ పని చేసిపెట్టు.. ఈ పని చేసిపెట్టూ..
అని ఆర్డర్స్ వేయడానికీ..!!🙄🤔🤔