..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday, 1 January 2019

నేను నన్ను వెతికే వేళ..

నేను ఎవరని నన్ను ,నేను తెలుసుకునే ప్రయత్నంలో.. నేను ఎవరో తెలుసుకోవాలని ఇతరుల ప్రయాస..! 
కొందరు అర్థమయ్యానని అళా మామ్ అని ఆప్యాయతని పెంచారు..! కొందరు అదోలా చూసి, అవకాశం లేక అమ్మోరుననీ అవతల పెట్టారు..! అందరూ నను అక్కా.. అని ఆదరిస్తే.. అదంతా అభిమానమని  వారికై ఆదుర్థా పడిపోయా..! మరికొందరేమో ఆకశాన ఆశావహివంటే.. అవునా..నిజమా అని ఆలోచించే లోపునే..  నిజాయితీ లేమి.., అహం పాలు ఎక్కువ అనేస్తూ.. అచేతన మదిని ,అభాసుపాలు చేసి ... ఈసడించి అడుసున తొక్కేసారు.. ! 
నేను ఎవరని నన్ను ,నేను తెలుసుకునే ప్రయత్నంలో.. నేను ఎవరో తెలుసుకోవాలని ఇతరుల ప్రయాస..!  
నన్ను ,నేను  తెలుసుకునే ప్రయత్నంలోనే  ప్రశ్న లేని జవాబునై ప్రయాశ పడుతుంటే.., నువ్వు ఇదీ.. అంటూ ఒకరు నాపై చూపే అభిశంసన..! మనస్సును మెలిపెట్టే.., మాటల తూటాల అవహేళన..! 
నేను ఎవరని నన్ను ,నేను తెలుసుకునే ప్రయత్నంలో.. నేను ఎవరో తెలుసుకోవాలని ఇతరుల ప్రయాస..! 
మరికొందరేమో.. మనస్సుకు మరీ దగ్గర అయిపోయానని.. మోతాదు మించి భరించలేననీ.. మనసుపై మకిలిని ముద్రించారు..
నేను ఎవరని నన్ను ,నేను తెలుసుకునే ప్రయత్నంలో.. నేను ఎవరో తెలుసుకోవాలని ఇతరుల ప్రయాస..! 

Sunday, 16 December 2018



చేరువగా ఉన్న దూరానివి...
స్నేహంలో దాగిన ప్రేమవి...
జీవితంలో ఉన్న నిజమైన ఊహావి...
మాటల్లో కనపడే మమతవి...
కానీ ఎప్పటికీ అందని కలవి...

Tuesday, 9 October 2018


నేను నిరంతర విథ్యార్థినే.. !
నవజాత శిశువు నుండీ.. నిశీథ వసుథ నుండీ..., నేర్చుకునే
నేను నిరంతర విథ్యార్థినే... !
పారాడే పాపాయి నుండీ.. ప్రవహించే సెలయేటి నుండీ.. ,నేర్చుకునే నేను
నిరంతర విథ్యార్థినే... !
ప్రాపంచిక విషయాల నుండీ.. పాదాక్రాంత చరిత్రల నుండీ.., నేర్చుకునే నేను నిరంతర విథ్యార్థినే... !
ఆప్తుల నుండీ.. ఆత్మీయుల నుండీ.., నిరంతరం నేర్చుకోవాలని తాపత్రయ పడే ..,నేను నిరంతర విథ్యార్థినే...!!🙏🏻

Thursday, 27 September 2018

IPC 497 ..
రాను రానూ  మన culture మాత్రమే కాదు , మన సనాతన ధర్మాలు కూడా మార్చబడుతున్నాయి! పెళ్ళి అనేది మన భారతదేశంలో వరకు అయితే .., ఒక స్ర్తీ పురుషుల జంటకి మాత్రమే జీవితాంతం కలసి +కట్టుబడి ఉండాలనే ఒకలాంటి ఒడంబడిక లాంటిది! ఇతర దేశాలలో వ్యవస్థ మన 497 సెక్షన్ అంతటి బలహీనమైనది! ప్రపంచంలోనే... మన వివాహ వ్యవస్థ కి చాలా గౌరవస్థానం ఉంది కూడా.., ఇక పై ఇలాంటి రాజ్యాంగ సడలింపులతో మన తరువాతి తరం వారు ఎవరు ఎంతమందితో మనగలుగుతారో ఊహించడం కూడా కష్టం! వివాహేతర సంబంధాలను చట్టబద్ధతతో నియంత్రించడం సబబు కాదు గానీ.., ఎవరికి వారే.. తామేమిటన్నది  తనను నమ్మిన వారి కి నిరూపించుకొనే అవసరం తెచ్చుకోకపోతే మంచిదేమో..!అయినా మనమేమయినా జంతువులమా..?! ఎవరైనా ఒకటే అనుకోవటానికీ..😅🤦🏻‍♀️ అలా ఆదిమానవులుగా మిగలకూడదనే నాగరికత నేర్చీ.. వివాహ వ్యవస్థ సృష్టించీ ... కట్టుబాట్లతో మెలగమంటే.., మళ్ళీ వివాహేతర సంబంధాలూ.., బహు భార్యత్వం/ భర్తృత్వం.. ఇలా కంప్యూటర్ యుగంలో కూడా మళ్ళీ రాతి యుగానికే మన ఆలోచనలు దిగజారిపోతున్నాయేంటో..!