..
madiki tochinadi...manasuki nachinadi.

Thursday, 27 September 2018

IPC 497 ..
రాను రానూ  మన culture మాత్రమే కాదు , మన సనాతన ధర్మాలు కూడా మార్చబడుతున్నాయి! పెళ్ళి అనేది మన భారతదేశంలో వరకు అయితే .., ఒక స్ర్తీ పురుషుల జంటకి మాత్రమే జీవితాంతం కలసి +కట్టుబడి ఉండాలనే ఒకలాంటి ఒడంబడిక లాంటిది! ఇతర దేశాలలో వ్యవస్థ మన 497 సెక్షన్ అంతటి బలహీనమైనది! ప్రపంచంలోనే... మన వివాహ వ్యవస్థ కి చాలా గౌరవస్థానం ఉంది కూడా.., ఇక పై ఇలాంటి రాజ్యాంగ సడలింపులతో మన తరువాతి తరం వారు ఎవరు ఎంతమందితో మనగలుగుతారో ఊహించడం కూడా కష్టం! వివాహేతర సంబంధాలను చట్టబద్ధతతో నియంత్రించడం సబబు కాదు గానీ.., ఎవరికి వారే.. తామేమిటన్నది  తనను నమ్మిన వారి కి నిరూపించుకొనే అవసరం తెచ్చుకోకపోతే మంచిదేమో..!అయినా మనమేమయినా జంతువులమా..?! ఎవరైనా ఒకటే అనుకోవటానికీ..😅🤦🏻‍♀️ అలా ఆదిమానవులుగా మిగలకూడదనే నాగరికత నేర్చీ.. వివాహ వ్యవస్థ సృష్టించీ ... కట్టుబాట్లతో మెలగమంటే.., మళ్ళీ వివాహేతర సంబంధాలూ.., బహు భార్యత్వం/ భర్తృత్వం.. ఇలా కంప్యూటర్ యుగంలో కూడా మళ్ళీ రాతి యుగానికే మన ఆలోచనలు దిగజారిపోతున్నాయేంటో..! 

Sunday, 16 September 2018









మనకి ఎంతో ఇష్టమైన పదార్ధం మన కళ్ళకి కనపడగానే.., ఆ పదార్థం తాలూకు రుచిని ముందుగా మన మనస్సులో గుర్తుకు తెచ్చుకొని తర్వాత దాని రుచిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తాం..! అలానే.., ఏదైనా సమస్యను అధిగమించ వలసిన టైంలో కూడా మనం అందుకు పూర్తిగా సిద్దపడినపుడే.. ఆ సమస్య మనల్ని ఎక్కువగా బాధపెట్టలేదు కదా.. so don’t give up! Be cool 

Tuesday, 17 April 2018

మానవత్వం లోపించిన మృగరాయుళ్ళ నడుమనిర్భయానికే  దుర్భర పరిస్థితి....
మాతృరూపానికే లోకానికెల్లా నీవు, క్షమలో ధరిత్రి పోలిక.. మానవాధముల నడుమ అవనియందు గరిక సమానమిక..
మాలిన్యపు లోకములో మనమధ్యే తిరుగాడే పసిపాపలను సైతం వదలని మదమెక్కిన మనుష్య మృగాలను తెగనరుకుటకు చాలునా పదీ పరకా చేతులు నీకూ..
మాయదారి లోకంలో నీవు ఒక అమ్మవీ..ఆలివీ..అక్కవీ.. చెల్లివీ.. అమానుషుల చేతిలో అసహాయ మూర్తివీ..

అదంతా కబోధి లోకానికెందుకు.. ఇది చాలును నువు ఒక ఆడదానివీ.. “ ఇది మాత్రమే చాలు నువ్వు కేవలం ఒక ఆడదానివీ...!!

Sunday, 18 March 2018

ఉగాది పండుగ శుభాకాంక్షలు🙏🏻

అనగనగనగా.. ఉగాది అనే ఒక తల్లికి షడ్రుచులనే ఆరుగురు పిల్లలున్నారట! వారిలో పెద్దదైనతీపి’ ..అందరి కంటే నేనే గొప్ప.., అందరూ నన్నే ఎక్కువగా ఇష్టపడతారు అనే అహంకారం కలదై చాలా గర్వపడేది. ఇక రెండవదైనపులుపు’ .. నాకేం తక్కువా..? నేను కూడా అందరికీ చాలా ప్రీతిపాత్రురాలిని అనే గర్వంతో ఉండేది. తరువాత మూడవదైనకారంఅయితే.. అందరికీ ఎవరి పట్లమమకారంఉప్పొంగినా .., విందులో నేను తప్పక ఉండి తీరాల్సిందే అని గర్వించింది..! ఇక నల్గవదైనఉప్పు’ ... అసలు నేను లేనిదే మనిషులకు జిహ్వ లేనట్లే అంటూ దర్జా ఒలికించింది..! ఇక ఐదవదైన అయినవగరు’... తాను లేనిదే.., జీవరాశికి జఠరాగ్ని ప్రసన్నం కాబోదని..అందరికంటే తానే ఎక్కువ గొప్ప అనీ... వాదించింది! చివరిగా , ఆరవదైనచేదుమాత్రం.. ఏమీ మాట్లాడక మౌనంగా ఉండుట చూసిన మొదటి ఐదుగురూ.., నీకు ప్రత్యేకత ఏమీ లేక పోగా మనుషులు అందరూ నిన్ను అసహ్యించుచూ నిన్ను దరిచేర నివ్వరనుచూ.. హేళన చేసిరి..! అప్పుడు చేదు చిరునవ్వుతో...” మనుషులందరూ మితిమీరి మిమ్మలను తిని, వారి ఆరోగ్యాన్ని పాడుచేసుకొనే సమయాన వారి ప్రాణాలను కాపాడేసంజీవనినిఅవటం నాఅదృష్టం అని సమాధాన మిచ్చింది! సంభాషణ విన్న వారి తల్లి.., మీరందరూ ఎవరికి వారు చాలా ప్రత్యేకత కల్గినవారే..! కానీ మీరందరూ ఒకే తల్లి బిడ్డలనే విషయం మరువకూడదు.., మీరందరూ కలసి ఉంటేనే , ఛైత్రాన వచ్చే అస్వస్థతలనుండి మానవులను రక్షింపగలరని.. “కలసి ఉంటే కలదు సుఖంఅనే సూక్తిని గుర్తు చేసింది !!! 
     💐మీకూ మీ కుటుంబ సభ్యులకూ శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻💐