..
madiki tochinadi...manasuki nachinadi.

Wednesday, 22 February 2017

ఆత్మీయుల ఆలంబనతో,
ఆప్యాయతా అనురాగాలతో,
ఆకాశమంత ఆదరాభిమానముతో,
అనన్యమైన ఆనందోత్సాహాలతో,
అద్వీతీయమైన ఆకాంక్షలతో,
అజరామరమైన ఆశయములతో,
అసాధారణ  ఆచరణలతో,
అద్భుతమైన ఆలోచనలతో,
ఆశావహ అవగతాలతో,
ఆరాటయుత అధిగమనాలతో,
ఆవేశము యెరుగని ఆశయాలతో,
ఆజ్ఞలెరుంగని అనుమతులతో,
అవనిని చూస్తూ ఎదిగే ఆ చంద్ర తారార్కాలతో,
ఆకాశప్రకాశాలతో వెలిగే అఖండ జ్యోతులతో,
అలుపెరుగని

Jaihindh💪🏻

ఆత్మీయుల ఆలంబనతో,
ఆప్యాయతా అనురాగాలతో,
ఆకాశమంత ఆదరాభిమానముతో,
అనన్యమైన ఆనందోత్సాహాలతో,
అద్వీతీయమైన ఆకాంక్షలతో,
అజరామరమైన ఆశయములతో,
అసాధారణ  ఆచరణలతో,
అద్భుతమైన ఆలోచనలతో,
ఆశావహ అవగతాలతో,
ఆరాటయుత అధిగమనాలతో,
ఆవేశము యెరుగని ఆశయాలతో,
ఆజ్ఞలెరుంగని అనుమతులతో,
అవనిని చూస్తూ ఎదిగే ఆ చంద్ర తారార్కాలతో,
ఆకాశప్రకాశాలతో వెలిగే అఖండ జ్యోతులతో,
అలుపెరుగని అజేయులమై  ఒదుగుదాం...భారతావని అమ్ముల పొదిలో !!!!!!!

Friday, 17 February 2017

స్త్రీ


ఒక ప్రక్క మహిళా సాధికారత అంటూ..., మరోప్రక్క మహిళా రిజర్వేషన్ యిమ్మంటూ...!🤔
ఒక ప్రక్క మహిళలకు అపూర్వ గౌరవ మంటూ....,
మరోప్రక్క మహిళలను అసభ్య పదజాలంతో కించపరచుకుంటూ...!🤔
ఒక ప్రక్క మహిన మహా మానవీయత మహిళలదంటూ...,
మరో ప్రక్క మహా మాయగాళ్ళ మోసాలకి సైతం తలొగ్గి నడుచుకుంటూ...

Thursday, 19 January 2017

Raakhi powrnima

అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేని వారికి ఆ భగవంతుడే "మిత్రులు" ‌అనే భాంధవ్యాన్ని సృష్టించి,  తోబుట్టువుల వలే  ఆనంద-ఆపదల సమయాలలో కలసి మెలగండని ... "మిత్రుల " రూపాన మనందరిని  కలిపినాడు.. కనుక తోడబుట్టకనే , తోబుట్టువులైన మీ అందరికీ... రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు...💐💐💐




పదాలలో పరిమళాల గుబాళింపు..
పెదాలలో.. చిరునగవుల మేళవింపు..
పాదాలలో.. పలువురికై పలవరింపు..
పరిచయాలలో.. ఆత్మీయతా ఆకళింపు..
ప్రమాణాలలో... తిరుగు లేని పాటింపు..
ప్రయత్నాలలో.. ఓటమెరుగని తెగింపు...
ప్రతివిజయాలలో.. కనిపించు వీటన్నింటి ప్రత్యేకింపు..!


Tuesday, 17 January 2017

మన మతం .. మంచితనం🤘🏻🤘🏻
మన కులం .. కలుపుగోలుతనం🎭
మన ఆక్రోశం.. సౌభ్రాతృ త్వం👫
మన ఆశయం.. సర్వసమానత్వం👬👭
మన గానం.. ప్రేరణా ప్రీత్యర్థం🎶🎶
మన ప్రయత్నం...అలల సాగర తత్వం🏖
మన పోరాటం..ఆశేష హిమాచలం🏔
మన గమనం.. విహంగ వీక్షణం..🕊
మన ఆవేశం.. నిర్జల తటాకం..🏞
మన ఆరాటం.. భావి ప్రయోజనార్దం..🎖
మన కర్తవ్యం .. భాధ్య్యతాయుక్తం..🕴
మన వచనం.. మృథు మథురం..🍭
మన హృదయం..హిమనీనదం..🌁
మన సహనం.. కారుణ్య నాదం..😁
మన సహచర్యం..మథుర జ్ఞాపకార్థం..🙏🏻
మన ...చరితం.. ఆదర్శ  పునీతం.. 👏🏻
మన.. భవితవ్యం..స్వేచ్ఛా కపోతం..🕊

నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,నయ వంచనకు తావు లేని నిజ మనుషుల నడుమన...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం...కానీ, నిశీధి మాటున పసితనాన్ని కోల్పోకుండా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ, నిశ్వార్ధపు ప్రేమ నిండిన నిలువెత్తు మమత రూపేణా...!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
నీదీ.. నాదీ భేదం చెరిపి,మనం మనం అందరం అనే సుదినానికై పాటుపడి..!
💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
ఆకలి దప్పికలెరుగని నవ లోక పరిచయానికై నాంది పలికేలా...!          💐నూతనత్వాన్ని కోరుకుందాం... కానీ,
మరుభూమిని చేరే లోపు, మనిషిని మనిషిగా ... సాటి మనిషి గుర్తించేలా...!
Wish u  a very happy new year💐