..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday, 13 September 2011

వెన్నెల వెలుగులు రాత్రికి ఇష్టం .........,
స్వాతి చినుకులు తామరకు ఇష్టం......., 
పచ్షని పైరు పుడమికి ఇష్టం......,
నీ చిరునవ్వుల సోగసేమో నా మనసుకి  చాలా ఇష్టం...!
విరులు ముడిచే వేళ నీ కురులనై .........
జలకమడే వేళ సెలయెరునై.............
అలంకరింప వేళ  నే కస్తురినై............ 
నాట్యమాడే వేళ నీ అందెలు తాకంగా నే పుడమినై..............!! 

Tuesday, 6 September 2011

lovly lips........

అధరాల మధురాలే కాదు ,అవి పూయిoచే మోము వనములో
ఎర్రని అందాల గులాబీ సుమాలు ....
తేనే చెక్కెర మిశ్రమం కాదు, అవి   పలికే  ఆణిముత్యాలు ...
కలహంస దరహాసము నందు ,అవి మారే  జలపాత నయగారాలు...
క్రీగంట చూపునూ  అవి మార్చు ,  కర్పూర కాంతి దీపాలు....!!


just 4 u..............

స్వర్గం ఇంత దగ్గరగా ఉందని తెలియదు ...,
మెరిసే నీకన్నుల్లోకి నే తొలిసారి చూసేవరకు...
స్వర్ణం ఎంత వ్యర్ధమైనదో తెలియదు.....,
నీమేని చాయ కాంచే  వరకు  ....
సెలయేటి అలలు ఎంతటి దిగదుడుపో తెలియదు..,
నీలాల నీ కురులు నా మోముని తాకేవరకు....
హంస నడకలు ఎంతటి విహీనమో తెలియదు..,
నీ పద సవ్వడి హొయలతో నా గుండె గంట మ్రోగేవరకు....!! 

Saturday, 3 September 2011

BEAUTY WITH BEAUTIFUL....


అరుణిమ తిలకం నుదిటిన

కరుణిమ చూపులు నయనంబున
మధురిమ పలుకులు అధరంబున 
హరిణిమ హొయలు దేహంబున 
ధరణిన సహనంబు తో సహవాసం 
క్షిపణి న సైతం తపన తో మమేకం 
తరుణీ నీకిదే ఎల్లలెరుగని మా వందనం !!













HAAAAAAAIIIIIIII..............plzzzzz... keep smiling :)

అరుణోదయ  వేళ నీలాకాస మేడలో శ్వేత మేఘాల పూల మాల ..... 
     అది కాంచగ అరవిచ్చే అరుణ వర్ణ  మందార సుమబాల.....
       అణువంత హిమ బిందువుని  పచ్చిక తన వొడి చేర్చే లాలనగా... 
అందాల అవనిలో ఆకతాయి చంద్రుడు వెళ్ళొస్తానంటూ  మనకి byeee , సూర్యునికి hai   చెప్పే ఈ సమయం ప్రతిరోజూ చూసినా అనిపించే  నాకు  , రోజూ సరికొత్త ప్రకృతి పరిచయంగా...