..
madiki tochinadi...manasuki nachinadi.

Tuesday, 17 December 2019


మనుగడనుండి.., మహోన్నతి వరకూ...
మరపునుండి..., మథురస్మృతి వరకూ...
మనవినుండి..., మమేకం వరకూ...
మహాశయం నుండి.., మహోధ్యమం వరకూ...
మనసునుండి .., మమత వరకూ...
మనిషి నుండి.., మహర్షి వరకూ..
మారుతున్న మనిషి.. సాటి మనిషి పట్ల
మానుషిగా మారుతున్నాడెందుకూ...??



Thursday, 5 December 2019

బాధలోంచి వచ్చే ప్రతి మాట భావం తో కూడి ఉంటది.....

భావంతో వచ్చే ప్రతి మాట బాణంతో కూడి ఉంటది....

బాణంతో వచ్చే ప్రతి మాట
బంగారు భవిష్యత్తుతో కూడి ఉంటది....
                                     By.
                             🌸 *KKR*🌸

Thursday, 14 November 2019

*మనం మనుషులం*

మన ఆచారాలుసంప్రదాయాలుపద్దతులు కేవలం నాగరికత మొదలు అయ్యాకేవచ్చాయి....

మతం గురుంచి ప్రక్క వారిని విమర్శించే వారు ముందు మనం మనుషులం అనిగుర్తించాలి....

సింధు నాగరికత తో మొదలు అయిన మన ప్రయాణం మౌర్యులుద్రవిడులుఆర్యులుఇంగ్లీష్ వారి రాకతో నూతన పద్దతులుసంప్రదాయాలు అలవరుచుకొన్నాం....

ఎన్నో సంప్రదాయాలుఆచారాలు ఇతరుల రాకతో మొదలు అయి కొన్ని కాలంతోనిలబడలేక సంఘ సంస్కర్తల పోరాటాల ఫలితంగా సమాధి చేయబడ్డాయికొన్ని ఇంకాఆచారణలోనున్నాయి....

సంప్రదాయాలుఆచారాలు అనేవి కాలంతో మారుతూ ఉంటాయి....

కాబట్టి  ఆచారాలుసంప్రదాయాలు కోసం పోరాటాలు గొడవలు మొ.... చేయాలి అనిఅనుకొనేముందు మనం మనుషులం
🙏🏻

🌸 *KKR* 🌸

Friday, 18 October 2019

మనుషుల కంటే.., వారి తాలూకు జ్ఞాపకాలే మనతో చిరకాలం ఉంటాయేమో..!

మనిషి   మారటానికి  వివిధ భావావేశాలు కారణం కావచ్చేమో.., కానీ  వారి  జ్ఞాపకాలు కి మాత్రం అవేమీ తెలియదు బహుశా అందుకే అవి సజీవమెన్నటికీ..!

“”మర్చిపోవటానికి   నీవేమీ కల లాంటి ఒక జ్ఞాపకానివి  కాదు.., నిత్యం స్పురణకొచ్చే వాస్తవానివీ..””!

Tuesday, 8 October 2019

చెడు ‘పై ‘మంచి ‘ సాధించిన విజయానికి ప్రతీకగా దసరాపండుగను జరుపుకోవటంపూర్వులు పెట్టిన ఆచారంసైంటిఫిక్గా చూసినా కూడా..  సీజన్ లో రకరకాల అంటువ్యాధులువిషజ్వరాలు వంటివి జనాలను పీడించకుండా.. పసుపు , వేపాకు , శమీ వృక్షం తదితరాలనుదుర్గాదేవిగా.., ( అనగా బాధలనునివారించునదని ఒక అర్థం ఉంది)భావిస్తూ)విరివిగాఉపయోగిస్తూ..  ఆయా రోగాలనుండి రక్షణ పొందటానికై అందరూఇటువంటి పండగల రూపంలో అయితే తప్పకుండా అటువంటియాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ వాడతారని పదిరోజుల పండుగలాగా డిజైన్ చేసి వుంటారు ఇంకా..,  మన సృష్టి మొత్తాన్నీ ఏదోఒక శక్తి  నడిపిస్తుందని నమ్ముతుంటాం కదా..,( అది ఎవరికి నచ్చినరూపంలోవారి ఇష్ట దైవం కావచ్చునుఅలా  శక్తి రూపాన్నిపూర్వులు కొందరు తమ మాతృమూర్తి గాఅభివర్ణించుకున్నారు.అలా, నవరాత్రుల రోజులలో స్త్రీ ని  అన్నిరూపాలలో పూజించటం కూడా అనాదిగా స్ర్త్రీ ని వివిధ రంగాలలోప్రోత్సహించే క్రమాన లక్ష్మీ(finance), సరస్వతీ(education) etc...  ఆచారాలు పుట్టినేడు తరాలు మార్పులతో ఆయా ఆచారాలుకూడా చాలా మార్పులు చెందివుంటాయి!

ఆచారాలన్నింటికి ఆమోదయోగ్యమైన కారణాలు ఉండాలి అని ఏమి లేదు....

మత పరమైన ఆచారాలకుమత గ్రంధాలే ప్రామాణికంసామాజిక అంశాలు కారణాలుకాకపోవచ్చు!

Monday, 7 October 2019

Our prayers would be like...

అష్ఠైశ్వర్యాలు అడుగము నిన్ను..,
అన్నార్తులను ఈ ప్రపంచాన అశేషముగా ఆదుకొనుము నీవు..!

ఆకాశ హర్మ్యాలు అడుగము నిన్ను..,
అవనియందున్న సమస్త ప్రాణికోటికిన్నూ తలదాచుకొను నీడనిమ్ము నీవు..!

ధీర్ఘాయుష్సును అడుగము నిన్ను..,
ధరణియందలి సర్వ జీవులకూ దయనీయ బాథారహిత మరణమునిమ్ము నీవు..!

భోగభాగ్యాలు అడుగము నిన్ను..,
భూలోకాన జనావళి కి బాల్యము మొదలు వృద్ధాప్యం వరకు ఆప్యాయతా అనురాగముల లోటు రానీయకుము నీవు..!

ఉన్నతవిధ్య నీయమని అడుగము నిన్ను..,
ఊసుపోక తోటి ప్రాణి ఉసురు తీసే ఉన్మాధులలో సైతం మానవతా విలువలను పెంపొందించుము నీవు..!