..
madiki tochinadi...manasuki nachinadi.

Friday, 1 February 2019


నా మనసు నన్ను మోసం చేస్తోంది...తనని మర్చిపోగలను అని...
నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి...కనపడే దూరంలో ఉంది తానే అని...

నా ధైర్యం నన్ను మోసం చేస్తుంది.....తను పక్కన లేకపోయినా నేను జీవితాన్ని గెలుస్తానని...!!
   



మధురమైన  మనసు భావన..
మరపులేని మథుర యాతన..!
మదిలోని రూపానికి ..,మరిచి పోలేని నేస్తానికీ..
మనస్సున మరో లోకానికీ.. మాయని మనో పరిచయానికి 
సెలవు అనలేక.., సెలవిస్తున్నా..।!







వదలి ఉండలేనంత ఇష్టం నాకున్నపుడు..., 
నీ ఇష్టం కోసం దూరంగ ఉండటానికి కూడా సిద్దపడిపోతున్నా..
 నాకు అది కష్టమనిపిస్తున్నా...!!

Sunday, 27 January 2019

నా కొత్త రోల్ లో అంత త్వరగా exists అవ్వలేపోతున్నా...! చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా..! ఏంటో ఏది right r wrong.. decide అవ్వలేపోతున్నా..! నా మనసు ఒకటి చెపితే.., నా బ్రెయిన్ ఒకటి చెబుతుందీ.,ఏది వినాలో తేల్చుకోలేకున్నా..! నా నీడను చూసి నేనే భయపడేంతగా తడబడిపోతూన్నా..! ఏం చేయాలో తెలియటలేదూ.. !

Tuesday, 22 January 2019

నీ మాటలకి,ఎప్పుడూ ఎంతగానో కోపం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా..!
 కానీ ప్రయత్నించిన ప్రతిసారీ విఫలమవుతుంటా...!
ఎందుకలా అన్నావా అని ఆలోచించేలోపే..., ఎలా ఇంత బాగా చెప్పగలిగావా అని మాటలతో మమేకమైపోతుంటా...!
బహుశా నువు తిట్టినా అదేదో మహా కావ్యం లా పదిసార్లు చదువుకునీ.., భలే చెప్పావు కదా అనుకుంటున్నా..!
నేను నాకే సరి కొత్తగా కనిపిస్తున్నా...! ఈలోపే నేను నిజంగా ఇదా.., అని ఆశ్చర్యపోతున్నా...!

ఇంకా ఎలా ఎలా మారబోతున్నానో ఏంటో.. అనుకుంటున్నా..!

Thursday, 17 January 2019

భయంకరమైన పెద్ద గుండె కోత ఏమిటంటే......,
        జ్ఞపకాలను మరిచిపోలేక పోవడం..!
            మరిచిపోయామనుకుంటాం కానీ..,
                మతిలేని    మనసుకు  మరపు ఉండదేమో..!!